మాస్క్ ధరించలేదని న్యాయవాదికి రూ. 500 ఫైన్: రూ. 10 లక్షల పరిహారం కోరిన అడ్వకేట్

మాస్కు ధరించలేదని  జరిమానా విధించిన పోలీసులపై ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. 

Lawyer moves HC against Rs 500 fine for not wearing mask in car, seeks Rs 10 lakh compensation

న్యూఢిల్లీ: మాస్కు ధరించలేదని  జరిమానా విధించిన పోలీసులపై ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. చట్టాన్ని అతిక్రమించి ఫైన్ విధించిన  పోలీసులపై ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు రూ. 10 లక్షల పరిహారాన్ని కూడ కోరాడు.


కరోనా నివారణ కోసం భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కును తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా రాష్ట్రాలు కూడ మాస్కులను ధరించాలని ఆదేశాలు ఇచ్చాయి.

ఢిల్లీకి చెందిన న్యాయవాది తన కారులో వెళ్తున్న  సమయంలో మాస్కును ధరించలేదు. బహిరంగ ప్రదేశంలో కారును డ్రైవ్ చేస్తూ  మాస్కును పెట్టుకోనందుకు గాను పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించారు.

ఈ విషయమై ఢిల్లీ హైకోర్టును న్యాయవాది ఆశ్రయించారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించారని ఆయన ఆరోపించారు. తనకు  రూ. 500 జరిమానా విధించడాన్ని న్యాయవాది తప్పుబట్టారు. 

తన కారులో ఒక్కడినే ప్రయాణం చేస్తున్నానని... ఆ సమయంలో మాస్కు అవసరం లేదని అడ్వకేట్ వాదిస్తున్నాడు.  ఈ మేరకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు కూడ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.

నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న తనను వేధింపులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరు పరువుకు భంగం కల్గించేలా ఉందన్నారు. అంతేకాదు మానసిక ఒత్తిడికి గురి చేశారని ఆయన ఆరోపించారు.

పోలీసుల తీరును తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.  పోలీసుల తీరును తప్పుబడుతూ రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై ఈ ఏడాది నవంబర్ 18న కోర్టు విచారణ  చేయనుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios