భారతదేశంలో కరోనా వైరస్ మొదలైన నాటి నుంచి ప్రతిరోజూ టీవీల్లో కనిపిస్తూ.. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్న కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కోవిడ్ బారినపడ్డారు.

తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు.

Also Read:భారత్ లో కరోనా కలకలం.. నిన్న ఒక్కరోజే వెయ్యి మరణాలు

అలాగే ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు స్వీయ నిర్బంధలో ఉండాలని ఆయన కోరారు. మరోవైపు భారత్‌ను కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది.

భారత్‌లో గడచిన 24 గంటల్లో 1007 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 48,040కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595. భారత్‌లో ఇప్పటివరకూ 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు