Asianet News TeluguAsianet News Telugu

రిటైర్డ్ ఆర్మీ సైనికుడిగా తేలిన లష్కరే ఉగ్రవాది.. ఢిల్లీలో అరెస్ట్..

ఆదివారం ఢిల్లీలో అరెస్టైన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అని తేలింది. అతను ఆర్మీనుంచి రిటైర్ అయిన సైనికుడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

Lashkar terrorist is a retired army personnel who arrested in Delhi says police - bsb
Author
First Published Feb 6, 2024, 4:09 PM IST

న్యూ ఢిల్లీ : ఢిల్లీ పోలీసులు  ఆదివారం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు రియాజ్ అహ్మద్‌. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన సైనికుడని తేలింది. 

కుప్వారా జిల్లాలోని ఎల్‌ఇటి మాడ్యూల్‌ను ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. ఎల్ఈటీ ఈ ప్రాంతంలో దాడులు చేయడానికి కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అహ్మద్, ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గులామ్ సర్వర్ రాథర్‌లతో కలిసి కుట్రలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

వీరిని సమన్వయం చేసుకుంటూ అహ్మద్ జమ్మూ కశ్మీర్ లో విధ్వంసం సృష్టించడానికి కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నియంత్రణ రేఖ నుంచి భారత్ లోకి తీసుకువచ్చేలా రియాజ్ అహ్మద్‌ కుట్రపన్నిననట్టు తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి జమ్మూకాశ్మీర్ లో విధ్వంసం సృషించడానికి పనిచేస్తున్న టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ ఆపరేషన్ తర్వాత ఐ అరెస్టు జరిగింది. వివిధ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్మగ్లింగ్ చేయడంలో ప్రమేయం ఉన్న ఐదుగురు గతంలోనే ఉగ్రవాదులను కర్నాహ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో జహూర్ అహ్మద్ భట్ దగ్గర ఎకె సిరీస్ రైఫిల్, మ్యాగజైన్లు, పిస్టల్స్ లభించాయి. దర్యాప్తులో భట్ ఇద్దరు పీఓకే ఆధారిత ఎల్‌ఈటీ టెర్రరిస్టు హ్యాండ్లర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలింది. వారు తమ దుర్మార్గపు కార్యకలాపాలకు మద్దతుగా ఆయుధాల సరుకులను పంపించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios