Language Row:  సౌత్ ఇండియా మూవీస్ కు నార్త్ ఇండియా మూవీస్ కు మ‌ధ్య కోల్డ్ వార్ సాగుతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, కన్నడ హీరో కిచ్చా సుధీప్ మధ్య లాంగ్వేజ్ వార్ నడుస్తూనే ఉంది. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూనే.. ఘాటుగా కౌంటర్లు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి.. స్పందించారు.  

Language Row: ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాంగ్వేజ్ వార్ హ‌ట్ టాఫిక్ గా మారింది. ఈ వివాదంపై తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలకు పూర్తి స్థాయిలో గౌరవం ఇస్తుందని, ప్రభుత్వం అన్ని ప్రాంతీయ భాషలను ఆదరించి, ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. 

హిందీ జాతీయ భాష హోదాపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య న‌డుస్తోన్న ట్విట్ట‌ర్ వార్ నేపథ్యంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ లో ఇలా రాసుకొచ్చారు. “కిచ్చా సుదీప చెప్పిన మాటలు వినలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని భాషలకు పూర్తి స్థాయిలో గౌరవం ఇస్తుంది.. హిందీ మన జాతీయ భాష.. అదే స్థాయిలో లేదా అదే త‌ర‌హాలో ఇత‌ర ప్రాంతీయ భాష‌ల‌కు కూడా అదే ఆదరణ‌తో ముందుకు తీసుకెళ్తాం.. ప్రాంతీయ భాషలతో పాటు జాతీయ భాష క‌లిసి ముందుకు తీసుకెళ్తాం ’ అని కేంద్ర మంత్రి అన్నారు.

అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కిచ్చా సుదీప్, దేవగన్ ల లాంగ్వేజ్ వార్ లో సుదీపాకు మద్దతునిచ్చారు, ప్రాంతీయ భాషే ప్రధానమని మద్దతు పలికారు. ప్రాంతీయ భాష చాలా ముఖ్యమైనది. బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. "కిచ్చా సుదీప్ చెప్పింది నిజమే. భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడినందున ప్రాంతీయ భాష చాలా ముఖ్యమైనది" అని అన్నారు.

దేవగన్, సుదీప్ ట్విటర్ మార్పిడిపై కర్ణాటక ప్రతిపక్ష నేతలు హెచ్‌డి కుమారస్వామి, సిద్ధరామయ్య కూడా వ్యాఖ్యానించారు. తన రాబోయే చిత్రం 'రన్‌వే 34' విడుదల కోసం శుక్రవారం ఎదురుచూస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, హిందీ ఇకపై భారతదేశ జాతీయ భాష కాదని సౌత్ స్టార్ కిచ్చా సుదీప్ వ్యాఖ్యానించిన తర్వాత అతనితో మాటల యుద్ధానికి దిగారు. 

మీడియా కథనాల ప్రకారం, ఒక కార్యక్రమంలో కిచ్చా సుదీప "హిందీ ఇకపై జాతీయ భాష కాదు" అని పేర్కొన్నాడు.