Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లోని బనిహాల్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఎన్ హెచ్ - 44పై నిలిచిపోయిన ట్రాఫిక్

జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఉన్న నేషనల్ హైవే నెంబర్ 44పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ దారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బండ రాళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Landslides at Banihal in Jammu and Kashmir..Traffic stuck on NH-44
Author
First Published Feb 1, 2023, 10:44 AM IST

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లా బనిహాల్ పట్టణంలోని జాతీయ రహదారి-44పై బుధవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాంపాడి ప్రాంతంలోని హైవే భాగం మూసుకుపోయింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హైవేపై భారీ బండరాళ్లు కనిపిస్తున్నాయి. 

అమెరికా ఉన్నతాధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీనిని క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నాయి. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించేందుకు యంత్రాలు పని చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసు జారీ చేసిన సూచనలు పాటించాలని రాంబన్ డిప్యూటీ కమిషనర్ ప్రజలను కోరారు. ‘‘జాతీయ రహదారి-44లో రాంపాడి, బనిహాల్ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రజలు జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సలహాలు పాటించాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కొన్ని రోజుల కిందట చందర్కోట్- బనిహాల్ మధ్య పలు చోట్ల కురిసిన వర్షాలకు రాళ్లు, కొండచరియలు విరిగిపడటంతో వరుసగా రెండు రోజుల పాటు హైవేను మూసివేశారు. అయితే ఇది తిరిగి తెరిచిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. రాంబన్ జిల్లాలోని పాంత్యాల్ వద్ద భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో సోమవారం హైవే దిగ్బంధమైంది. ఈ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ప్రధాన మార్గంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios