దాణా కేసులో చివరిదైన డొరండా కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఖరారైన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. 

రాంచీ : ఆర్జేడీ నేత Lalu Prasad Yadav మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జార్ఖండ్ రాజధాని Ranchiలో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు గతంలో bihar రాష్ట్రాన్ని కుదిపేసిన Fodder Scamలో చిట్ట చివరిది, అయిదోది అయిన Doranda కేసులో లాలూకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 

అలాగే లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం.. జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచగా.. గత మంగళవారం ఈ కేసులో లాలూను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం తుది తీర్పును వెల్లడించిన న్యాయస్థానం... ఈ కేసులో మరో నలభై ఆరు మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా తేల్చింది. 

ఇదిలా ఉండగా, సోమవారం దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను గత వారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించిన సంగతి తెలిసిందే. డొరండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. నేడు ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. 

ఇప్పటికే నాలుగు పశు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా కోర్టులు తేల్చాయి. చైబాసా ట్రెజరీ నుండి విడతల వారీగా రూ.37.7 కోట్లు, రూ.33.13కోట్లు డియోఘర్ ట్రెజరీ నుండి రూ. 89.27 కోట్లు, రూ.3.76 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. తాజాగా Doranda ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. 

2018లో దుమ్కా కేసులో దోషిగా తేలినందుకు ఆయనపై రూ. 90 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. గతంలోని నాలుగు కేసులపై వచ్చిన తీర్పులను కూడా లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేశారు. ఈ తీర్పును కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. ఈ ఐదు కేసులు కూడా పశువుల దాణా కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను స్వాహా చేసిన కేసులే కావడం గమనార్హం.

2017 డిసెంబర్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉన్నాడు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోనే ఎక్కువకాలం శిక్షను అనుభవించాడు. గత ఏడాది జనవరి మాసంలలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీకి తీసుకొచ్చారు.ఈ కేసులో మూడేళ్లకు పైగా శిక్ష పడితే లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.