బీహార్ మాజీ  ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శుక్రవారం నాడు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన చైబాసా ట్రెజరీ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో కేసులో ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  చివరి కేసులో ఆయనకు  బెయిల్ దక్కడానికి ఇంకా నెల రోజుల సమయం పట్టే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. 

బీహార్ లో ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ తరుణంలో లాలూప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించడం ఆర్జేడీకి ఊరటనిచ్చే అంశం.  జైలు నుండి విడుదలైతే ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి చైబాసా ఖజానా నుండి అక్రమంగా అక్రమంగా ఉపసంహరించుకొన్న కేసులో రాంచీ సీబీఐ కోర్టు అతనికి ఐదేళ్ల శిక్షను విధించింది.  ఈ కేసులో తన శిక్షలో సగం తగ్గించినట్టుగా లాలూ యాదవ్ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ కారణం చేత అతనికి బెయిల్ రావాల్సి ఉంది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడ కారణం.

ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన లాలూకు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ వ్యతిరేకించింది.నాలుగు కేసుల్లో లాలూకు శిక్షపడినట్టుగా సీబీఐ సమాధానం చెప్పింది.