లలిత్‌పూర్ లో ఫార్మా పార్క్ ఏర్పాటు ... యూపీ అభివృద్ది దిశగ యోగి సర్కార్ చర్యలు

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో 1500 ఎకరాల్లో భారీ బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణం జరుగుతోంది. నాణ్యతతో కూడిన ఔషధాల ఉత్పత్తి చవకగా లభించేలా, ఉపాధి కల్పన లక్ష్యంగా యోగి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది.  

Lalitpur Bulk Drug Pharma Park Transforming UPs Pharmaceutical Landscape AKP

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని లలిత్‌పూర్ జిల్లాలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశ ఔషధ అవసరాలను తీర్చడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది కీలకమైన చర్య.

సైద్‌పూర్ గ్రామ పంచాయతీలో పశుసంవర్థక శాఖకు చెందిన 2000 ఎకరాల్లో దాదాపు 1500 ఎకరాలను ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యుపిసిడా)కి ఉచితంగా బదలాయించారు. భూమి బదలాయింపుతో ప్రాజెక్టు తదుపరి దశకు చేరుకుంది. ఇక్కడ ఔషధ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఔషధాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచ స్థాయి కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ (సీఐఎఫ్) ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు లలిత్‌పూర్‌కే కాదు యావత్ ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

నాణ్యమైన, చవకైన ఔషధాల ఉత్పత్తి  

లలిత్‌పూర్‌లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ రాష్ట్రానికి, దేశానికి ఔషధ ఉత్పత్తుల కేంద్రంగా మారుతుంది. ఉన్నత నాణ్యత గల చవకైన ఔషధాల ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ఉద్దేశం. బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో భారతదేశ ఆత్మనిర్భర్తను పటిష్టం చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) ద్వారా ఈ పార్క్ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ ఔషధ రంగంలోని ప్రముఖ సంస్థలను ఆకర్షించేందుకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఓఐ) ఇప్పటికే విడుదల చేశారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధానం

రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఫార్మా పార్క్‌కు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. లాజిస్టిక్స్ సులభంగా చేరవేతకు ఉన్నత నాణ్యత గల రోడ్లు, రైలు లింకులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా లలిత్‌పూర్, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పట్టణాలు, రంగాలవారీ పారిశ్రామిక పార్కులు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.

పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మా పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. రసాయన వ్యర్థాలను సున్నా లిక్విడ్ డిశ్చార్జ్ వంటి ప్రమాణాలతో తొలగిస్తారు. ఉత్తరప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే కాకుండా, భారతదేశ ఔషధ అవసరాలకు కేంద్రంగా మార్చాలనేది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన దార్శనికత. బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ ఈ దృక్పథంలో భాగం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios