Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ‌పై యూకే కోర్టులో కేసు వేస్తానని లిత్ మోదీ హెచ్చరిక.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై యూకే కోర్టులో కేసు వేస్తానని అన్నారు.

Lalit Modi says he will sue Rahul Gandhi in UK court ksm
Author
First Published Mar 30, 2023, 11:22 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఇంటిపేరు..’’ అంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ చేయడంపై స్పందించిన లలిత్ మోదీ.. తనను పరారీలో ఉన్న వ్యక్తి అని  పేర్కొనడంపై రాహుల్ గాంధీపై యూకే కోర్టులో కేసు వేస్తానని అన్నారు. తాను దోషిగా నిర్దారించబడలేదని.. దేశంలోని సాధారణ పౌరుడని పేర్కొన్నారు. రాహుల్‌ను ‘‘పప్పు’’ అని కూడ సంభోదించారు. ఈ మేరకు లలిత్ మోదీ ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు.  

ఏ కారణాలతో తనను ‘‘పరారీ’’ అని ముద్రవేస్తున్నారని లలిత్ మోదీ ప్రశ్నించారు. తాను ఎప్పుడూ దోషిగా నిర్ధారించబడలేదని చెప్పారు. అందుకే తాను సాధారణ పౌరుడనని పేర్కొన్నారు. రాహుల్‌తో పాటు ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడిన లలిత్ మోదీ.. తనపై పగబట్టారని ఆరోపించారు. ‘‘ప్రతి సాధారణ వ్యక్తి, రాహుల్ గాంధీ సహచరులు నేను న్యాయానికి పారిపోయిన వ్యక్తిని అని పదే పదే చెబుతూనే ఉంటారు. ఎందుకు? ఎలా?. నేను ఈ రోజు వరకు ఎప్పుడు దోషిగా నిర్ధారించబడ్డాను?. పప్పు అకా రాహుల్ గాంధీలా కాకుండా.. నేను ఇప్పుడు సాధారణ పౌరుడిని’’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలకు వేరే గత్యంతరం లేదని.. వారు అవగాహన లేకుండా ఉన్నారని లేదా పగబట్టే ధోరణిలో ఉన్నారని అనిపిస్తుందని అన్నారు. 


తాను రాహుల్ గాంధీని యూకే కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆయన కొన్ని గట్టి సాక్ష్యాధారాలతో ముందుకు రావాలని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని చెప్పారు. ఆయనను ఆయనే పూర్తిగా ఫూల్‌గా మార్చుకోవడం కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్‌ నేతలకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించిన లలిత్ మోదీ.. తాను చిరునామాలు, ఫొటోలను పంపగలనని అన్నారు. భారతదేశ ప్రజలను అసలు మోసగాళ్లు ఎవరు మోసం చేయవద్దని విమర్శలు గుప్పించారు. 

‘‘గాంధీ కుటుంబం మన దేశాన్ని పాలించే అర్హత వారిదే అన్నట్టుగా తయారు చేసింది. అవును, మీరు కఠినమైన బాధ్యత గల చట్టాలను ఆమోదించిన వెంటనే నేను తిరిగి వస్తాను’’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు. ‘‘గత 15 ఏళ్లలో తాను ఒక్క పైసా కూడా తీసుకున్నట్లు రుజువు కాలేదు. కానీ స్పష్టంగా నిరూపించబడినది ఏమిటంటే.. నేను ప్రపంచంలోనే గొప్ప క్రీడా ఈవెంట్‌ను సృష్టించాను, ఇది దాదాపు 100 బిలియన్ డాలర్లను ఆర్జించింది’’ అని లలిత్  అన్నారు. 

 

1950వ దశకం ప్రారంభం నుంచి మోదీ కుటుంబం కాంగ్రెస్‌కు, దేశానికి వారు ఊహించనంత ఎక్కువ చేశామని లలిత్ మోదీ అన్నారు. ‘‘నేను కూడా వారు కలలు కన్న దానికంటే ఎక్కువ చేశాను. స్కామ్ కళంకిత దోపిడిదారులు తమ సొంత గాంధీ కుటుంబంలా ఉన్నారు.. కాబట్టి మొరుగుతూ ఉండండి’’ అంటూ లలిత్ మోదీ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. 

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ సూరత్ కోర్టు దోషిగా తేల్చిన కొద్ది రోజుల తర్వాత లలిత్ మోడీ ఈ విధంగా స్పందించారు. లలిత్ మోదీ 2019లో కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేసు పెడతానని బెదిరించారు. గాంధీ కుటుంబం ఐదు దశాబ్దాలుగా భారతదేశాన్ని ‘‘పగటిపూట లూటీ’’ చేసిందని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios