కేరళలో దర్శనమిచ్చిన మకరజ్యోతి: శబరిమలకు పోటెత్తిన భక్తులు
శబరిమలలో భక్తులకు మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరికి చేరుకున్నారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని శబరిమలలో పొన్నాంబలమేడుపై భక్తులకు మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. మూడుసార్లు మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూశారు. శబరిమలలోని 10 చోట్ల మకర జ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఏటా మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది శబరిమలకు వస్తుంటారు. శబరిమలకు వచ్చే భక్తుల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కేరళలోని శబరిమల ఆలయంలో జరుపుకునే వార్షిక కార్యక్రమం మకరవిళక్కు. పవిత్రమైన వార్షిక కార్యక్రమం ముగింపును ఇది సూచిస్తుంది.మకర జ్యోతిని చూసేందుకు శబరిమలకు లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు.
ఏడు రోజుల కార్యక్రమం మకర సంక్రాంతి రోజున ప్రారంభమౌతుంది. అయ్యప్ప ఆభరణాలతో కూడిన తిరువాభరణం ఊరేగింపు కూడ ఉంటుంది. ప్రతి ఏటా శబరిమల కొండల్లో మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు.2011, జనవరి 14న శబరిమలలో తొక్కిసలాట జరిగింది. మకర జ్యోతి దర్శనం కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. దీంతో మకర జ్యోతి దర్శనం సమయంలో వచ్చే భక్తులకు ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం చేస్తుంది.