Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri violence: "లఖింపూర్ ఖేరీ" ప్ర‌ధాన సాక్షి పై హత్యాయత్నం ..

Lakhimpur Kheri violence: లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన సాక్షి అయిన‌ దిల్‌బాగ్ సింగ్‌పై మంగళవారం రాత్రి దాడి జరిగింది. దిల్‌బాగ్ సింగ్ కారుపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో దిల్‌బాగ్ సింగ్ తృటిలో తప్పించుకున్నాడు.
 

Lakhimpur Kheri violence witness escapes attempt on life
Author
Hyderabad, First Published Jun 1, 2022, 12:43 PM IST

Lakhimpur Kheri violence: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్​ ఖేరీ ఘటనలో.. ప్రధాన‌ సాక్షిపై మంగళవారం రాత్రి దాడి  హత్యాయత్నం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన‌ సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దిల్​బగ్​ సింగ్​ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న ఇద్దరు దుండగులు.. కాల్పులకు తెగబడ్డారు. పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో దిల్​బగ్ సింగ్ తృటిలో తప్పించుకున్నాడు.

వాహనంపై పలు రౌండ్లు కాల్పులు..

లఖింపూర్​ జిల్లా దిల్​బగ్​ సింగ్ .. భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా.. మంగళవారం ఆయన తన ఎస్​యూవీ వాహ‌నంలో లఖింపూర్ నుండి గోలాకు వెళుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో అలీగంజ్ సమీపంలో తన కారుపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారనీ. ఇందులో దిల్‌బాగ్ సింగ్ తృటిలో తప్పించుకున్నట్టు తెలిపారు.

 త‌న‌ కేటాయించిన పోలీసు గార్డు మంగ‌ళ‌వారం సెలవు పెట్టాడనీ. అత్య‌వ‌స‌ర ప‌ని నిమిత్తం త‌న‌ కారులో లఖింపూర్ నుండి గోలాకు వెళ్లాననీ. రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో ఇద్ద‌రూ యువ‌కులు బైక్​ మీద వచ్చి త‌న‌ వాహనాన్ని అడ్డుకున్నారనీ, అనంత‌రం కారు టైర్​ని పంచర్​ చేశార‌ని తెలిపారు. ఆ త‌రువాత‌..  వాహనం డోర్​ తీయాలని ప్రయత్నించారనీ, ఆ డోర్ ఓపెన్ కాక‌పోవ‌డంతో కారుపై కాల్పులు జరిపి పారిపోయారని దిల్​బగ్​ సింగ్​ వెల్లడించారు.

ఈ ఘ‌ట‌న‌లో దిల్​బగ్​ సింగ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ​ ఘటనాస్థలానికి వెళ్లి దిల్​బగ్​ సింగ్​పై దాడి జరిగిందని ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన‌ట్టు తెలిపారు.  కాగా.. దిల్​బగ్​కు కేటాయించిన సెక్యూరిటీ గార్డు సెలవులో ఉన్నట్టు తమకు తెలియదని, ముందే తెలిసి ఉంటే.. వేరే ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు అన్నారు.

దిల్‌బాగ్ సింగ్‌పై దాడిని భారతీయ కిసాన్ యూనియన్ (BKU/BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయ‌త్ ఖండించారు. దాడి చేసిన వారిని త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ సంఘ‌ట‌న‌పై సమాజ్‌వాదీ పార్టీ స్పందించింది. త‌న అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఒక సందేశం కూడా షేర్ చేయబడింది. 'మొదటి రైతులను కారులో తొక్కించారు. అదే.. ఇప్పుడు ప్రధాన సాక్షి దిల్‌బాగ్ సింగ్‌పై ఘోరమైన దాడి చేశారు. ఈ  కేసులో న్యాయమైన దర్యాప్తు చేయాల‌ని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడికి శిక్షించాలనీ, బాధితుల‌కు న్యాయం చేయ‌లేని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.  

ఇదీ ఘటన.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. రైతులు నిరసనబాట పట్టి.. కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే సాగు చట్టాలను ఉపసంహరించుకుంది మోడీ ప్ర‌భుత్వం.

Follow Us:
Download App:
  • android
  • ios