Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగికి పుట్టిన బిడ్డకు శ్వాస ఇచ్చి.. ప్రాణాలు నిలిపిన వైద్యురాలు..

కరోనా వైరస్ తో బాధపడుతున్న ఓ తల్లి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఊపిరాడక ఆ చిన్నారి పడుతున్న వేదన చూసి, తక్సణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు.

Lady Doctor Gave Oxygen Corona Patient Delivered Baby in Chennai - bsb
Author
Hyderabad, First Published Apr 14, 2021, 8:06 PM IST

కరోనా వైరస్ తో బాధపడుతున్న ఓ తల్లి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఊపిరాడక ఆ చిన్నారి పడుతున్న వేదన చూసి, తక్సణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు.

మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాల్లోకి ఈ ఘటన వివరాల్లోకి వెళితే ..కరోనా కాలంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, ప్రసవాల నిమిత్తం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనా బారిన పడ్డ  గర్భిణుల పరిస్థితి దారుణంగా మారుతుంది.

 చికిత్స అందించడంలో కొన్నిచోట్ల తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం చెన్నై పెరంబుర్ రైల్వే ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం ఓ గర్భిణిని చేర్చారు.

టెస్టుల్లో ఆమెకు కరోనా పాజటివ్ అని తేలింది. దీంతో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చిన  ఫోన్‌కాల్‌తో డాక్టర్‌ ప్రియాంక ఆస్పత్రికి పరుగులు తీశారు

పెరంబూరు రైల్వే ఆసుపత్రిలో ఆ గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే లేబర్ రూంకు తరలించారు. కొన్ని గంటల అనంతరం పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. 

అయితే ఆమె కరోనా రోగి  కావడంతో తల్లీబిడ్డల్ని విడదీయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ బిడ్డకు శ్వాస సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన డాక్టర్ ప్రియాంక తక్షణం స్పందించారు. ఆ బిడ్డను రక్షించేందుకు ఆ బిడ్డ నోట్లో నోరు పెట్టి శ్వాస అందించారు. 

డాక్టర్ ప్రియాంక మానవత్వాన్ని చాటి వ్యవహరించిన తీరు వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆమెను అభినందిస్తున్నారు. ఆమె తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. నిరుడు  కరోనా బారిన పడిన ప్రియాంక ఆ బాధను ప్రత్యక్షంగా అనుభవించారు. 

ఆమె కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలని.. విధులకు కొద్దిరోజులు విరామం ఇవ్వాలని వైద్యులు సూచించినా.. వైద్య వృత్తిని సేవాతత్వంగా భావిస్తూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆ బిడ్డను రక్షించాలి అని ఆకాంక్షతో శ్వాసను అందించడమే కాదు.. ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే వరకు దగ్గరుండి ప్రియాంక అందించిన సేవలను ఆస్పత్రి వర్గాలు కొనియాడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios