Asianet News TeluguAsianet News Telugu

హృదయ విదారక ఘ‌ట‌న: 10 కిలోమీటర్లు మృతదేహాన్ని న‌డుచుకుంటూ మోసుకెళ్లిన‌ కుటుంబ సభ్యులు

Vellore: త‌మిళ‌నాడులో హృదయ విదారక ఘ‌ట‌న చోటుచేసుకుంది. రోడ్డు సౌక‌ర్యాలు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో స‌కాలంలో వైద్యం అంద‌క‌పోవ‌డంతో పాముకాటుకు గురైన ఒక బాలిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబ స‌భ్యులు మృత‌దేహాన్ని చేతుల్లో పెట్టుకుని 10 కిలో మీట‌ర్ల‌కు పైగా దూరం న‌డిచారు. క‌న్నీరు పెట్టించే ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 
 

Lack of road facilities, Girl died of snakebite due to lack of timely medical treatment, parents took her body on foot for 10 km
Author
First Published May 29, 2023, 12:17 PM IST

snake bite: త‌మిళ‌నాడులో హృదయ విదారక ఘ‌ట‌న చోటుచేసుకుంది. రోడ్డు సౌక‌ర్యాలు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో స‌కాలంలో వైద్యం అంద‌క‌పోవ‌డంతో పాముకాటుకు గురైన ఒక బాలిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబ స‌భ్యులు మృత‌దేహాన్ని చేతుల్లో పెట్టుకుని 10 కిలో మీట‌ర్ల‌కు పైగా దూరం న‌డిచారు. క‌న్నీరు పెట్టించే ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళ‌నాడులోని వేలూరు జిల్లాలోని తమ గ్రామానికి ఆదివారం చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ తల్లిదండ్రులు, బంధువులు నడుచుకుంటూ వెళ్తున్న హృదయ విదారక దృశ్యాల‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు విస్తృతంగా ప్రసారమ‌య్యాయి. వేలూరు జిల్లా అల్లేరి గిరిజన గ్రామంలోని అతిమరతు కొల్లైలో దినసరి కూలీలైన వీజీ, ప్రియ దంపతుల ఏడాదిన్నర కుమార్తె అయిన‌ తనుక్ష ఇంటి బయట నిద్రిస్తుండగా నాగుపాము కాటు వేసింది. 

వెంట‌నే తల్లిదండ్రులు, బంధువులు ఆమెను వేలూరులోని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు అంబులెన్స్ ను పంపించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు మళ్లీ అంబులెన్స్ ఎక్కారు. అయితే కొండ ప్రాంతం తమ గ్రామానికి రాకపోకలు సాగించలేకపోవడంతో అంబులెన్స్ వారిని గమ్యస్థానానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో దింపిందని గ్రామస్తులు తెలిపారు.

దీంతో తల్లిదండ్రులు మృతదేహాన్నిచేతుల‌పై పెట్టుకుని క‌న్నీరుమున్నీర‌వుతూ.. కుటుంబం ముందుకు సాగింది. మృతదేహాన్ని మోసుకెళ్లిన బాలిక తల్లి, నానమ్మ గంటలకు పైగా సాగిన ఈ ప్రయాణంలో విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా మృతదేహంపై రోదిస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు అంద‌రినీ క‌న్నీరు పెట్టిస్తున్నాయి. అయితే, ఈ రోడ్డు సౌక‌ర్యాలు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించ‌ని అధికారులు బాధితులు చెబుతున్న‌ట్టుగా ప10 కిలో మీట‌ర్ల దూరం కాద‌ని వేలూరు జిల్లా కలెక్టర్ పి.కుమారవేల్ పాండియన్ చెప్పుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఇది గ్రామస్థులు చెప్పినట్లు 10 కిలోమీటర్లు కాదనీ, ఆరు కిలోమీటర్ల పొడవు అన్నారు. గ్రామానికి రహదారిని వేసే పనిలో ఉన్నామని చెప్పారు. 

రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు లీలావతి ధన్ రాజ్ మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లు అనేక గిరిజన గ్రామాలకు శాపంగా మారాయన్నారు. ఈ గ్రామాలు రక్షిత రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిర్దేశించిన విధంగా ఈ గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇది వారికి వేగంగా వైద్య సహాయం పొందడానికి సహాయపడుతుందనీ, ఆరోగ్య కార్యకర్తలు ఈ గ్రామాలకు చేరుకోవడానికి కూడా వీలుక‌ల్పిస్తుంద‌ని పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios