తమిళనాడులో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మాట్లాడుకుందాం అని పిలిచి ప్రియురాలితో కలిసి గొంతు నులిమి హత్యచేశాడు. మృతదేహాన్ని 40 కి.మీ. దూరంలో పాడేసి వచ్చాడు. 

చెన్నై : Tamil Naduలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను అతి దారుణంగా murder చేశాడు. హత్యచేసిన చిన్న కాంచీపురం నుంచి మృతదేహాన్ని దాదాపు 40 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకెళ్లి శ్రీపెరంబుదూర్‌లో పడవేశాడు. దీనికి అతడి ప్రియురాలు సహకరించింది. ఆ వ్యక్తిని, ప్రియురాలిని పోలీసులు సోమవారం రాత్రి arrest చేశారు.

ఎన్ ప్రియ అనే మహిళను హత్య చేశారనే ఆరోపణలపై అరెస్టు చేసిన కె నవీన్ కుమార్ (25) రోజుకూలీ, అతని భాగస్వామి పి.కల్పన(27)లను కోర్టు జైలుకు పంపింది. ఏప్రిల్ 23న శ్రీపెరంబుదూర్‌లోని థెరిసాపురంలో పొదల్లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆ మృతదేహం 22 ఏళ్ల ప్రియాగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రియ భర్త నవీన్‌కుమార్‌ను విచారించారు. ముందుగా ఏవో సాకులు చెప్పిన నవీన్ కుమార్ ఆ తరువాత హత్య చేసినట్లు అంగీకరించాడు. 

నవీన్ కుమార్, ప్రియతో విడిపోయి విడిగా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం ప్రియ ఆమె మృతశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణం ఆమె వ్యభిచారానికి పాల్పడడమేనని ఆరోపిస్తూ అతను ఆమెతో విడిపోయాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. ఆ తరువాత డైవోర్సీ అయిన కల్పనతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. అయితే, తనను విడిచిపెట్టి.. కల్పనతో సహజీవనం చేస్తుండడాన్ని ప్రియ తట్టుకోలేకపోయింది. వీలైనప్పుడల్లా వీరిమీద దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టింది. అని విచారణ అధికారి తెలిపారు.

ఇటీవల కల్పన గంజాయి వ్యాపారం గురించి ప్రియ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో కల్పనను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. జైలునుంచి బైటికి వచ్చాక ఎలాగైనా ప్రియను అంతమొందించాలని కల్పన, ఆమె సోదరుడు పథకం వేశారు. దీనికి నవీన్ కూడా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

వీరి పథకం ప్రకారం, ఏప్రిల్ 22న, మాట్లాడుకుందాం రమ్మంటూ నవీన్, ప్రియను చిన్న కాంచీపురంలోని టీచర్స్ కాలనీలోని ఒక ఇంటికి పిలిచాడు. అక్కడ నవీన్, ప్రియతో మద్యం తాగించాడు. ఆమె మద్యం మత్తులోకి చేరుకున్న వెంటనే.. కల్పన, నవీన్ దగ్గరికి వచ్చింది. ఆ తరువాత మత్తులో ఉన్న ప్రియను ఇద్దరూ కలిసి దుపట్టాతో గొంతు చంపారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బైక్‌పై మృతదేహాన్ని తమ ఇద్దరి మధ్య ఉంచుకుని బయలుదేరారు. పోలీసులకు అనుమానం రాకుండా... బైక్ పై ముగ్గురు వెడుతున్నట్లుగా కనిపించేలా నాటకం ఆడారు. అలా చిన్న కాంచీపురం నుండి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న పొదల్లో మృతదేహాన్ని పారవేసారు" అని ఒక అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. తంజావూరు కలియమేడులోని ఆలయ వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లైవ్ వైర్ కారుకు తగలడంతో మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.