సినీనటి సుమలతకు.. కర్ణాకట సీఎం కుమారస్వామి.. బహిరంగ క్షమాపణలు తెలిపారు. ‘భర్త మృతి చెంది రెండు నెలలు కాలేదు.. అప్పుడే సుమలతకు రాజకీయాలు అవసరమా’ అంటూ.. కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

కాగా.. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. దీంతో.. సీఎం కుమారస్వామి స్పందించాల్సి వచ్చింది. తాను సుమలతను క్షమాపణలు చెబుతున్నట్లు సీఎం చెప్పారు. తన తమ్ముడు చేసిన తప్పును కూడా సీఎం వెనకేసుకు రావడం గమనార్హం.

మీడియాలో వాళ్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేడయంతో.. రేవణ్ణ ఆవేశంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అయినా హెచ్చరికతో మాట్లాడాల్సి ఉండేదని ఎవరికీ బాధ కలిగించరాదని రేవణ్ణ తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

తమ  కుటుంబం మహిళలను అవమానించదన్నారు.  ఇదిలా ఉండగా మండ్యలో మీడియాతో మాట్లాడిన జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కూడా సుమలతకు క్షమాపణలు చెప్పారు. ఏ సందర్భంలో మంత్రి రేవణ్ణ అలా వ్యాఖ్యానించారో తెలియదని జేడీఎస్‌ పార్టీ మహిళలంటే ఎనలేని గౌరవం ఇస్తుందన్నారు.