కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌తో చేతులు కలపడం మూలంగా తన 12 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించుకున్న ఘనతంతా వృథా అయిపోయిందని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం సిద్ధరామయ్య తనపై అనేక కుట్రలు పన్నారని ... ఆయన కారణంగానే అనేకసార్లు కన్నీరు కార్చాల్సి వచ్చిందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను గుర్తించలేకపోయానని ఆయన గుర్తుచేసుకున్నారు. తన కలల్ని, రాజకీయ జీవితాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని ఆరోపించారు.
తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌తో చేతులు కలిపానని వెల్లడించారు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలిగిన పక్షంలో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించామని కుమారస్వామి గుర్తుచేశారు.
కుమారస్వామి వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
అబద్దాలు చెప్పడంలో దేవేగౌడ కుటుంబం దిట్టగా వర్ణించారు. అన్నీ చేసి చివరకు కన్నీరు కార్చడం కుమారస్వామికే చెల్లుతుందని సిద్ధూ ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో జేడీఎస్ కింగ్ మేకర్‌గా నిలిచింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలలకే ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 6, 2020, 2:40 PM IST