దేశంలో పెట్రోలు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఉన్న ధరలు ఈ రోజు ఉంటాయో లేని పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. ధరలు తగ్గించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.

ఇలాంటి పరిస్ధితుల్లో ప్రజల ఇబ్బందులను గమనించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పెట్రోల్, డీజిల్‌పై రూ.2లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచుతున్నట్లు కుమారస్వామి ప్రకటించడంపై అప్పట్లో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

పన్నులు విధించినా ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఇంధన ధరలు తక్కువేనని సీఎం ప్రకటించారు. అయితే రోజు రోజుకి చమురు ధరలు చుక్కలను తాగుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 2 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు.