రాహుల్.. మీకు తెలివిలేదేమో! ఆయన మీ పార్టీని మింగడం ఖాయం: కేటీఆర్

రాహుల్ గాంధీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెట్టిన కోవర్ట్ రేవంత్ రెడ్డి అని, ఈ విషయంలో రాహుల్‌కు తెలివి లేదేమో కానీ, పక్కనున్నవారినైనా అడిగి తెలుసుకోవాలి కదా అంటూ సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మింగడం ఖాయం అని పేర్కొన్నారు.
 

ktr slams rahul gandhi, you may not know revanth reddy is a bjp covert but should ask party peoples kms

హైదరాబాద్: నిన్నా మొన్నటి వరకు తెలంగాణలో వార్ వన్ సైడే అన్నట్టుగా గులాబీ దళంలో ఆత్మవిశ్వాసం ఉండేది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్ కూడా హస్తం పార్టీని టార్గెట్ చేసుకుంటున్నది. తెలంగాణలో ప్రస్తుతం ప్రచారంలో ఈ రెండు పార్టీల మధ్యే బలమైన పోటీ నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నడో టికెట్లు ప్రకటించి చాలా ముందుగా పోటీకి తెరలేపింది. ఇప్పుడు ప్రచార పర్వం జోరుగా చేపడుతున్నది. కేసీఆర్ క్యాంపెయినింగ్ ప్రారంభించగా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పూరించారు. ఈ సందర్భంలోనే ఉభయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.

రాహుల్ గాంధీ తన పర్యటనలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూనే బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వారసత్వ పార్టీ అని, బీజేపీకి బీ టీమ్ అని ఘాటు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా సవాల్‌గా స్వీకరించి అంతే వాడితో ప్రతివాదనలు చేస్తున్నది. రాహుల్ గాంధీ కామెంట్లపై కేటీఆర్ స్పందించారు.

బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని, కాంగ్రెస్సే సీ టీమ్ అని.. సీ టీమ్ అంటే చోర్ టీమ్ అని కేటీఆర్ కామెంట్ చేశారు. తాము బీజేపీకి బీ టీమ్ కాదని, కాంగ్రెస్ మాత్రం చోర్ టీమ్ అని పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని తెలిపారు. ఏ టు జెడ్ కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఆదర్శ్ స్కామ్, బోఫోర్స్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ ఇలా జెడ్ వరకు స్కామ్‌లు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయని వివరించారు.

Also Read: మోడీ, కేసీఆర్ కుమ్మక్కు .. సింగరేణిని అదానీకి అమ్మాలని కుట్ర , అడ్డుకుంటాం : రాహుల్ గాంధీ

అదే విధంగా రాహుల్ గాంధీకి తెలివి లేదేమో గానీ, అసలు దొంగ రేవంత్ రెడ్డే అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెట్టిన కోవర్ట్ రేవత్ రెడ్డి అని, దీనిపై మీకు తెలివి లేదేమో కానీ, పక్కనున్నవారినైనా అడిగి తెలుసుకోవాలని సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గంపగుత్తగా ఆయన బీజేపీలోకి తీసుకెళ్లుతాడని ఆరోపణలు సంధించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మింగడం ఖాయం అని కామెంట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios