కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షలను ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాపార కార్యకలాపాలు, ప్రజా రవాణాకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు.. అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా ఎత్తేస్తున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏపీ , తెలంగాణలకు ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది

కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షలను ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాపార కార్యకలాపాలు, ప్రజా రవాణాకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు.. అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా ఎత్తేస్తున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏపీ , తెలంగాణలకు ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. రేపటి నుంచి 50 శాతం సామర్ధ్యంతో 6 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సర్వీసులు ప్రారంభమవుతాయని, అలాగే ఏపీలో ఆంక్షలు కొనసాగుతుండటంతో సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేవారంతా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, మాస్క్ ధరించడంతో పాటు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. ksrtc. karnataka.gov. in లేదా www.ksrtc.in వెబ్‌సైట్లలో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. 

Also Read:అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచి ఏపీకి బస్సులు

మరోవైపు ఏపీకి బస్సులు నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు, ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ సడలించిన నేపధ్యంలో ఈ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. అలాగే తెలంగాణ నుంచి కర్నాటకకు కూడా బస్సులు తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. కర్నాటకలో కూడా వారాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తూ కర్ఫ్యూ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో కర్ఫ్యూ సడలింపులకు అనుగుణంగా తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనుంది.