అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేతతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడవనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనుంది టీఎస్ఆర్టీసీ.
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేతతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడవనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనుంది టీఎస్ఆర్టీసీ. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి తెలంగాణ బస్సులు నడవనున్నాయి. అలాగే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలోకి తెలంగాణ బస్సులు నడుస్తాయి.
Also Read:తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత.. కేసీఆర్ కీలక నిర్ణయం, తేలని అంతర్రాష్ట్ర సర్వీసుల అంశం
కాగా, తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ శనివారం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
