Asianet News TeluguAsianet News Telugu

'హ్యాపీ బర్త్‌డే పాపా': సూసైడ్ నోట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు 

 రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో మరో విద్యా కుసుమం నేల రాలింది. నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న 18 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి రూమ్ లో హృదయ విదారక సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.

Kota student wrote heartbreaking suicide note  in Happy Birthday Papa KRJ
Author
First Published Aug 4, 2023, 6:05 PM IST

రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో మరో విద్యా కుసుమం నేల రాలింది. నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న 18 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకుని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అతడిని మంజోత్ సింగ్ (18 సంవత్సరాలు)గా గుర్తించారు.అతను యూపీలోని రాంపూర్ నివాసి. ఏప్రిల్ నుంచి కోటాలో ఉంటూ వైద్యానికి సిద్ధమవుతున్నారు.

మంజోత్ కు తన తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్ ను అప్రమత్తం చేశారు. అతని గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపు బద్దలు కొట్టి చూడగా.. ఆ విద్యార్థి రూమ్ లో విగతజీవిగా కనిపించాడు. ముఖానికి పాలిథిన్‌ కవర్ చుట్టుకుని ఊపిరాడని స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న విధానం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. 

అంతకుముందు విద్యార్థి హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో హస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ కి యాంటీ సూసైడ్ పరికరాలను అమర్చారు. దీంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో గది మొత్తం వెతకగా.. పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆయన వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌ను కూడా పరిశీలిస్తుమని తెలిపారు.. 

'హ్యాపీ బర్త్‌డే పాపా'

విద్యార్థిని గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అందులో ‘నా కుటుంబ సభ్యులను, నా స్నేహితులను ఇబ్బంది పెట్టకండి.నా చర్యకు ఎవరూ బాద్యులు కారు. నేను నా ఇష్టానుసారం చేశాను. కాబట్టి, దయచేసి నా స్నేహితులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు" అని ఆ యువకుడు నోట్‌లో రాశాడు. "హ్యాపీ బర్త్ డే పాపా" అని గోడపై అతికించిన మరో నోట్ రాశాడు.  హాస్టల్‌లో ఉంటూ విద్యార్థి నీట్‌కు సిద్ధమవుతున్నట్లు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దివేష్ భరద్వాజ్ తెలిపారు. 

జనవరి నుండి ఇప్పటి వరకు కోటాలో 19 మంది కోచింగ్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ సెల్ కూడా రూపొందించారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా కలెక్టర్‌ రూపొందించారు. ఇంత జరుగుతున్నా ఆత్మహత్యల కేసులు ఆగడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios