Asianet News TeluguAsianet News Telugu

గుండిలోని హిందుస్థాన్ ఇంటర్నేషన్‌ల్ స్కూల్‌లో ‘‘కొరియన్ డే’’ వేడుకలు

చెన్నై గుండీలో ఉన్న హిందుస్థాన్ ఇంటర్నేషన్ స్కూల్‌లో కొరియన్ డే వేడుకలు అక్టోబర్ 16న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఎం హంగ్‌ యుప్‌ లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులు తమ కొరియన్ విద్యార్థులతో కలిసి ఆ దేశపు సంస్కృతి ప్రతిబింబించేలా దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

korean day celebrations at hindustan international school guindy chennai
Author
Chennai, First Published Nov 1, 2019, 4:19 PM IST

చెన్నై గుండీలో ఉన్న హిందుస్థాన్ ఇంటర్నేషన్ స్కూల్‌లో కొరియన్ డే వేడుకలు అక్టోబర్ 16న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఎం హంగ్‌ యుప్‌ లీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులు తమ కొరియన్ విద్యార్థులతో కలిసి ఆ దేశపు సంస్కృతి ప్రతిబింబించేలా దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిండిలోని హిందుస్థాన్ పాఠశాలలో కేజీ నుంచి 6వ తరగతి వకు కొరియన్ విద్యార్ధులు గణనీయ సంఖ్యలో ఉన్నారు.

korean day celebrations at hindustan international school guindy chennai

కొరియన్ డేకు సంబంధించిన అరిరాంగ్ గేయాన్ని విద్యార్ధులు శ్రావ్యబద్ధంగా అలపించడంతో పాటు సాంప్రదాయ బద్ధమైన ఫాన్ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొరియన్ జానపద కథలలో అంతర్భాగమైన కుందేలు మరియు తాబేలు కథను గుర్తు చేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అలరించింది.

korean day celebrations at hindustan international school guindy chennai

కొరియన్ డే ద్వారా హిందుస్థాన్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులు, సిబ్బందిలో అంతర్జాతీయ దృక్పథాన్ని తీసుకురావడంతో పాటు విద్యార్ధి దశలోనే వారిని ప్రపంచ పౌరులుగా మార్చేందుకు వీలు కల్పిస్తుందని హెచ్ఐఎస్ యాజమాన్యం ఆకాంక్షించింది.

korean day celebrations at hindustan international school guindy chennai

అలాగే కొరియన్ విద్యార్ధులతో కలిసి కొరియన్ డేను జరుపుకోవడం ద్వారా కొరియా ప్రజల యొక్క అత్యున్నత స్ఫూర్తి విద్యార్ధులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 

"

Follow Us:
Download App:
  • android
  • ios