Asianet News TeluguAsianet News Telugu

కేర‌ళ వాసుల‌ను హ‌డ‌లెత్తిస్తున్న వీధి కుక్క‌లు.. వ‌రుస దాడుల‌తో ఆందోళ‌న‌

Kollam: కేరళలో వీధి కుక్కల బెడద కొనసాగుతోంది. 12 ఏళ్ల బాలికతో పాటు ఏడుగురిపై దాడి చేశాయి. కొల్లాంలోని ఓ ఆలయం వెలుపల ఆదివారం సాయంత్రం 12 ఏళ్ల బాలుడితో సహా ఏడుగురిపై వీధి కుక్క దాడి చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Kollam : Stray dogs harassing the people of Kerala; Worried about the series of attacks
Author
First Published Jan 2, 2023, 4:48 PM IST

Kerala Stray Dogs: కేరళలో కుక్కల బెడద కొనసాగుతోంది. 12 ఏళ్ల బాలికతో పాటు ఏడుగురిపై దాడి చేశాయి. కొల్లాంలోని ఓ ఆలయం వెలుపల ఆదివారం సాయంత్రం 12 ఏళ్ల బాలుడితో సహా ఏడుగురిపై వీధి కుక్క దాడి చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కుక్క‌లు దాడి చేస్తున్న‌ప్పుడు అక్క‌డున్న పోలీసులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని రావ‌డంతో అక్క‌డి నుంచి పారిపోయాయి. 

వివరాల్లోకెళ్తే... కేర‌ళ‌లో వ‌రుస‌గా వీధి కుక్క‌ల దాడులు చోటుచేసుకుంటుండ‌పై ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. ఆదివారం సాయంత్రం కొల్లాంలో 12 ఏళ్ల బాలికతో సహా ఏడుగురిపై కుక్కల దాడి జరగడంతో వీధికుక్కల బెడద కేరళను వెంటాడుతూనే ఉంది. కొల్లాంలోని ఒక దేవాలయం సమీపంలో వీధికుక్క దాడి చేసినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులతో సహా ఏడుగురిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటన కొల్లం కులతుపుజ శ్రీధర్మ శాస్తా ఆలయంలో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగింది.

వీధికుక్క ఏడుగురిపై దాడి చేసింది, అందులో అభిరామి అనే 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఏడుగురిని చికిత్స నిమిత్తం కులతుపుజ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఇజకి, మణికందన్ అనే ఇద్దరిని పునలూరు తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుక్క‌లు దాడిచేస్తున్న స‌మ‌యంలో వారిని రక్షించేందుకు వచ్చిన పోలీసులు క‌ర్ర‌ల‌తో కొట్ట‌డంతో అక్క‌డి నుంచి కుక్క‌లు పారిపోయాయి. కాగా,  గత రెండు రోజులుగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే, గుడి ఆవరణలో, రోడ్డు పక్కన వీధికుక్కల బెడద తీవ్రంగా ఉంది. గాయపడిన వారిలో ఒకరైన జాకబ్ కులతుపుజాలో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా వీధికుక్క దాడి చేసింది.

కొట్టాయం మెడికల్ కాలేజీ ఆవరణలో.. 

గత కొన్ని నెలలుగా అనేక వీధికుక్కల గుంపు స్వైర‌విహారం చేస్తుండటంతో కొట్టాయం మెడికల్ కాలేజీ ఆవరణలో భయం పట్టుకుంది. శుక్రవారం ఒక వీధికుక్క వైద్యుడితో సహా ఆరుగురిపై దాడి చేసి భయాందోళన వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. ఈ క్ర‌మంలోనే దానిని త‌రిమేయ‌డంతో పారిపోతున్న స‌మ‌యంలో వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఆర్థోపెడిక్ విభాగంలో ప‌నిచేస్తున్న డాక్టర్‌తో పాటు, బాధితులలో ENT విభాగానికి చెందిన ఒక మహిళా ఉద్యోగి, ఇద్దరు తాత్కాలిక సిబ్బంది, ఇద్దరు రోగుల బంధువులు ఉన్నారు. వాహనం పార్క్ చేసి ఆసుపత్రి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వైద్యుడిపై కుక్క దాడిచేసి క‌రిచింది. ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఆవరణలో 300కు పైగా కుక్కలు తిరుగుతున్నాయ‌నీ, ఒక నెల‌లో ఈ ప‌రిస‌రాల్లో 20 మందికి పైగా కుక్కకాటుకు గుర‌వుతున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. "కుక్క ఒకటి కంటే ఎక్కువ మందిని కరిచినట్లయితే రేబిస్ వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. కరిచిన వారికి తప్పనిసరిగా టీకాలు వేయాలి. కుక్క కళేబరాన్ని అందుబాటులో ఉంచితే దానిని పరిశీలిస్తామని" జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ షాజీ పనిక్కస్సేరి తెలిపారు.

వీధికుక్కలు చిన్నారిని ఈడ్చుకెళ్లాయి..

కొల్లాంలోని కొట్టియం వద్ద ఇంటి వరండాలో ఆడుకుంటున్న ఒక ఏడాది చిన్నారి వీధికుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చాయి. కుక్కలు పిల్లవాడిని కొరికి దాదాపు ఐదు మీటర్ల దూరం రోడ్డుపైకి లాగి, మళ్లీ దాడి చేశాయి. అటుగా వెళ్తున్న యువ‌కులు కుక్క‌ల నుంచి ఆ చిన్నారిని ర‌క్షించాయి. అతను ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios