దుస్తులూడదీసి, విద్యార్థికి చిత్రహింసలు: నగ్నంగా వీడియో

Kolkata student stripped naked, tortured inside college
Highlights

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కాలేజీ గదిలో దుస్తులూడదీసి, తనను చిత్రహింసలు పెట్టి, నగ్నంగా వీడియోలు తీశారని ఓ విద్యార్థి ఆరోపించాడు. ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ చెప్పారు 

వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెయింట్ పాల్స్ కాథడ్రల్ కాలేజీలో విద్యార్థి కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా ఓ గ్రూప్ అతని దుస్తులు ఊడదీయించడం కనిపిస్తోంది. 

ఆ సంఘటనపై విద్యామంత్రికి విద్యార్థి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాడు. కాలేజీ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఇటువంటి దుష్ప్రవర్తనను సహించేది లేదని విద్యా మంత్రి అన్నారు. 

మొదటి సంవత్సరం విద్యార్థి అయిన అనతు తృణమూల్ కాంగ్రెసు ఛాత్ర పరిషత్ (టిఎంసిపి) కాలేజీ శాఖ సభ్యుడని తెలుస్తోంది. మే 17వ తేదీన ఓ విద్యార్థి సంఘానికి చెందిన సీనియర్ విద్యార్థులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు అతను ఆరోపించాడు. 

తాను కాలేజీ అధికారులతో, ఉత్తర కోల్ కతా టిఎంసిపి సభ్యులతో  మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని టిఎంసిపి రాష్ట్ర అధ్యక్షురాలు జయ దత్తా చెప్పారు. 

loader