Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ బీజేపీ ర్యాలీ.. హింసాత్మక ఘటనలకు పాల్పడిన పలువురి అరెస్టు

Kolkata: బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన నలుగురిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడిలో కనీసం 27 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని కోల్‌కతా పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ పోలీసు సిబ్బంది ప్రస్తుతం సీఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  

Kolkata Police: Bengal BJP rally.. 4 arrested for violent incidents
Author
First Published Sep 14, 2022, 3:10 PM IST

Kolkata  violence: కోల్‌కతా స‌హా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ అవినీతిని ఖండిస్తూ..  బీజేపీ 'నబన్న ఒభిజాన్స  ర్యాలీ నిర్వ‌హించింది. అయితే, ఈ సచివాల‌య ముట్ట‌డి ర్యాలీ సంద‌ర్భంగా ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణలు చోటుచేసుకున్నాయి. కోల్‌కతా పోలీసులతో బీజేపీ నాయకుడు, కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో యుద్ధభూమిని తలపించింది. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన నలుగురిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కోల్‌కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్.. మంగ‌ళ‌వారం సెప్టెంబర్ 13న బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసింది. డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లోని రౌడీ నిరోధక విభాగం బృందం రాత్రిపూట కోల్‌కతాలోని నార్కెల్‌దంగా, బెలేఘాటా ప్రాంతాలతో సహా అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించి మొత్తం నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులందరినీ బుధ‌వారం నాడు బ్యాంక్‌షాల్ కోర్టులో హాజరుపరచనున్నారు. కోల్‌కతా పోలీసులు హౌరా బ్రిడ్జి వద్ద‌.. ప్ర‌భుత్వాన్నిన‌కి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న బీజేపీ ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవ‌డంతో బీజేపీ నాయ‌కులు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. పోలీసు వాహ‌నాల‌ను త‌గులబెట్టారు. నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో కోల్‌కతా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నిరసన సమయంలో ప్రస్తుతం కోల్‌కతా పోలీస్‌లోని సెంట్రల్ డివిజన్‌లో నియమించబడిన అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేబ్జిత్ ఛటర్జీపై ర్యాలీ నుండి వచ్చిన ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆయ‌న చేయి విరిగింది.  ప్రస్తుతం ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడిలో కనీసం 27 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని కోల్‌కతా పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ పోలీసు సిబ్బంది ప్రస్తుతం సీఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కోల్‌కతా పోలీసు వాహనానికి కూడా పోలీస్ స్టేషన్ సమీపంలో నిప్పు పెట్టారు. కోల్‌కతా పోలీసులు మంగళవారం వివిధ పోలీస్ స్టేషన్లలో గుర్తు తెలియని నిందితులపై హత్యాయత్నం కేసుతో సహా మొత్తం ఆరు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అభియోగాలను కోల్‌కతా పోలీసుల డిటెక్టివ్ విభాగానికి తక్షణమే అప్పగించారు. కోల్‌కతా పోలీసు ఏసీపీ దేబ్‌జిత్ ఛటర్జీపై దాడి, ర్యాలీ సందర్భంగా పోలీసు వాహనానికి నిప్పంటించిన ఘటనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307, ప‌లు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసుల పనికి ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసులపై దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios