అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అల్లరి చేస్తున్నారని ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను నాలుగో అంతస్థు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగాల్ రాజధాని కలకత్తాలోని బుర్జా బజార్ ప్రాంతంలో 55సంవత్సరాల ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్నారులు అల్లరి చేస్తుండడం భరించలేకే వారిని పైనుంచి కిందకు విసిరేశానని చెప్పుకొచ్చాడు. అయితే వారు మరణించాలని తాను విసిరేయలేదని, కేవలం కోపంతో వారిని పైనుంచి పడేశానని నిందితుడు వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
