కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఈ వైరస్ బారిన పడుతున్నారో.. ఎవరు ప్రాణాలు కోల్పోతున్నారా అసలు తెలియడం లేదు.  దీంతో.. వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అలాంటి పరిస్థితిల్లో.. కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని పక్కన పెట్టుకొని ఓ కుటుంబం రెండు రోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్ కతాకి చెందిన ఓ 71 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. కాగా.. అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. ఆ అంతక్రియలకు సంబంధిత సిబ్బంది అంగీకరించలేదు. మృతుడి కోవిడ్ పరీక్ష ఫలితం, డెత్ సర్టిఫికేట్ చూపిస్తే గానీ.. అంత్యక్రియలు చేయడానికి వీలు లేదని వారు చెప్పారు.

అయితే.. డెత్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రికి వెళితే... కోవిడ్ పరీక్ష చేయకుండా.. ఇవ్వమని వారు తేల్చి చెప్పారు. వాళ్లు వచ్చి మృతదేహానికి పరీక్షలు చేసి వెళ్లిపోయారు. ఆ రిజల్ట్ రావడానికి రెండు రోజుల సమయం పట్టింది.

దీంతో కుటుంబసబ్యులు మృతదేహాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి.. దానితో పాటే రెండు రోజులు గడిపారు. దాదాపు 48 గంటల తర్వాత మున్సిపల్ సిబ్బంది డెడ్ బాడీని తీసుకువెళ్లారు. కాగా.. అతనికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లడం గమనార్హం.

ఇదిలా ఉండగా...  చనిపోవడానికి ముందు రోజే వృద్ధుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో.. హాస్పిటల్ కి వెళ్లి.. కరోనా పరీక్ష చేయాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే చనిపోవడం గమనార్హం.

కాగా.. వైద్యులు పీపీఈ కిట్ ధరించి మరీ పరీక్ష చేయడం గమనార్హం. కాగా.. ఈ ఘటనపై వృద్ధుడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసినా వాళ్లు సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. సదరు వృద్ధుడి కుటుంబసభ్యులను ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించే పనిలో పడ్డారు అధికారులు.