Asianet News TeluguAsianet News Telugu

21 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బీజేపీ నేత‌ మిథున్ చక్రవర్తి

Kolkata: జూలైలో తాను చెప్పినదానికి కట్టుబడి ఉన్నాననీ, 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీతో టచ్‌లో ఉన్నారని, వారిలో 21 మంది నేరుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్నారని  ప్ర‌ముఖ న‌టుడు, బీజేపీ నాయ‌కుడు మిథున్ చక్రవర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 

Kolkata : 21 Trinamool MLAs are in touch: BJP leader Mithun Chakraborty
Author
First Published Sep 25, 2022, 11:26 AM IST

Mithun Chakraborty: 21 మంది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ప్ర‌ముఖ న‌టుడు, బీజేపీ నాయ‌కుడు మిథున్ చక్రవర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, బెంగాల్ కు సంబంధించి జూలైలో తాను చెప్పినదానికి కట్టుబడి ఉన్నాననీ, 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీతో టచ్‌లో ఉన్నారన్నారు. వారిలో 21 మంది నేరుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్నారని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీజేపీ నాయ‌కుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేత‌లు బీజేపీకి ట‌చ్ లో ఉన్నార‌ని పేర్కొన్నారు. 21 మంది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "నేను ఇంతకుముందు చెప్పాను.. ఈ రోజు కూడా నేను ఇంతకు ముందు చెప్పినదానికి క‌ట్టుబ‌డి ఉన్నారు. దయచేసి కొంత సమయం వేచి ఉండండి.. నును చెప్పిన విష‌యాలు నేరుగా మీరు కూడా చూస్తారు. టీఎంసీ నాయకులను చేర్చుకోవడంపై పార్టీలో అభ్యంతరం ఉంది.. చాలా మంది నాయకులు నాతో ట‌చ్ లో ఉన్నారు. మేము కుళ్ళిన బంగాళాదుంపలను తీసుకోమని నాయ‌కులు చెప్పారు" అని మిథున్ చక్రవర్తి అన్నారు. 

కాగా, మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరు. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మొత్తం 294 సీట్ల‌లో 213 స్థానాల‌ను గెలుచుకుంది. అప్ప‌టి నుంచి ఆయ‌న బ‌హిరంగా స‌మావేశాల‌కు దూరంగా  ఉన్నారు. అంతకుముందు, పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్రంలో వచ్చే ఆరు నెలలు కూడా ఉండదని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. రాబోయే ఆరు నెలల్లో "కొత్త, సంస్కరించబడిన టీఎంసీ" వస్తుందని అధికార పార్టీ పోస్టర్లు వేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమ పనిని చేస్తున్నాయనీ, ఈ పార్టీ (టీఎంసీ) ఆరు నెలలు కూడా ఉండదన్నారు. ఈ ఏడాది డిసెంబరు టీఎంసీ ప్ర‌భుత్వం చివ‌రిగడువు అవుతుంద‌ని సువేందు అధికారి పుర్బా మేదినీపూర్‌లో అన్నారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్ష్మీభండార్ పథకం లబ్ధిదారులకు వివిధ కేంద్ర పథకాల నుంచి డబ్బులు అందజేస్తున్నారని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి శనివారం మమత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గత తొమ్మిది నెలలుగా ఈ వ్య‌వ‌హారం  కొనసాగుతోందని తెలిపారు. విచ్చలవిడిగా అవినీతి కారణంగా బెంగాల్‌కు పీఎం ఆవాస్, ఎంఎన్‌ఆర్ఇజీఏ, జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులు నిలిపివేసిందని సువేందు అధికారి అన్నారు. స‌ర్వశిక్షా అభియాన్‌ కింద కేంద్రం ఇస్తున్న నిధుల్లో అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపించారు. పిల్లలు ముట్టుకోడానికి కూడా ఇష్టపడని విధంగా.. బ‌డుల్లో తక్కువ స్థాయి దుస్తులు ఇచ్చారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios