అత్యాచారం చేసి. బాధితురాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. కేరళలోని కొచ్చీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
అత్యాచారం చేసి బాధితురాలిని వివాహం చేసుకుని శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక రేపిస్ట్‌కు షాక్ తగిలింది. ఆ వ్యక్తికి ఊహించని విధంగా కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించబడింది. కేరళలోని కొచ్చీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకేళ్తే.. ఎకోర్టుకొచ్చి లోని పాలూరుతికి చెందిన 22 ఏళ్ల వ్యక్తి 2018 జూలైలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ జరిగింది. బాధితురాలుతో పాటు ఆమె తల్లి ఎదురుతిరిగారు. నిందితుడికి అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. దీంతో .. నిందితుడు 2019లో అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం మేజర్ అయిన బాధితురాలిని అతడు పెళ్లి చేసుకున్నాడు. 2021లో వారికి ఒక సంతానం కలిగింది.
అంత సాఫీగానే ఉందని భావిస్తున్న తరుణంలో ఈ కేసులో కొచ్చీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించింది. నిందితుడు బాధితురాలిని వివాహం చేసుకున్నప్పటికీ.. చేసిన నేరం నుంచి తప్పించుకోలేడని కోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం వంటి క్రూరమైన నేరానికి పాల్పడిన నిందితుడు వివాహం చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేసిన.. తర్వాత స్కాట్-ఫ్రీగా వెళ్లే సందర్భాలు దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా ఉన్నాయి.
బాయ్ ఫ్రెండ్‌తో ఫారెస్ట్‌కు వెళ్లిన బాలిక.. దాడి చేసి వివస్త్రను గ్యాంగ్.. వీడియో వైరల్
ఓ యువతి తన స్నేహితుడితో కలిసి సిటీ అవుట్స్ కట్స్ లోని ఫారెస్ట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆరుగురు దుండగులు.. వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని వివస్త్రను చేసి.. రాక్షసుల్లా ప్రవర్తించారు. ఆ దారుణాన్ని వీడియో తీశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను వైరల్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. యూపీలోని హమీర్‌పుర్‌కు చెందిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నగర శివార్లలోని అడవి ప్రాంతానికి వెళ్లింది. ఓ నిర్మాష్య ప్రాంతంలో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆరుగురు యువకుల గ్యాంగ్ వచ్చి.. వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దుర్భషలాడుతూ.. శారీరకంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆ బాలికను వివస్త్రను చేసి.. మొబైల్లో వీడియో తీశారు. వారితో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆ వీడియోను వారి స్నేహితులకు పంపి వైరల్ చేశారు.
అయితే ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాల్ని గుర్తించి.. ఆమె వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ క్రమంలో ఆరుగురు నిందితుల్లో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. బాధితురాలితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ పై నిందితులు దాడి చేశారు. అనంతరం వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతున్నాం. ముగ్గుర్ని అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అని హమీర్పుర్ పోలీసులు తెలిపారు.
