కొచ్చి : ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు కొచ్చిలోని ఫ్లాట్‌లో 27 ఏళ్ల మహిళపై అత్యాచారం, హింసకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని త్రిశూర్ జిల్లాకు చెందిన పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు.

ప్రధాన నిందితుడు మార్టిన్ జోసెఫ్ త్రిస్సూర్ జిల్లాలోని పెరమంగళంలో పట్టుబడ్డాడు, తరువాత అతన్ని కొచ్చికి తీసుకువచ్చారు.

"మేము ఒక గంట క్రితం మార్టిన్ జోసెఫ్‌ను పట్టుకున్నాం. పోలీసులు అతన్ని త్రిస్సూర్ జిల్లాలోని పెరమంగళంలో పట్టుకున్నారు. మేము అతని అరెస్టును నమోదు చేసాం, దీనిమీద డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక అతడిని త్రిస్సూర్ నుండి కొచ్చికి తీసుకువస్తాం. నిందితుడిని రేపు కోర్టులో హాజరుపరుస్తాం. దీనిమీద మరిన్ని వివరాలు రేపు ఉదయం తెలుపుతాం" అని కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం అన్నారు.

సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై......

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మార్టిన్ జోసెఫ్ ముగ్గురు సహచరులను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులను శ్రీరాగ్, జాన్ జాయ్, ధనేష్లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ మార్టిన్ కొచ్చి నుండి తప్పించుకుని  త్రిస్సూర్ కు వెళ్లడానికి  సహాయపడ్డారు. ఈ ముగ్గురిని ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. పోలీసులు వారి కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కన్నూర్ లో నివసించే ఓ ఓ మహిళ ఏప్రిల్ 8 న ఓ వ్యక్తి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షేర్ ట్రేడర్ అయిన 33 ఏళ్ల నిందితుడు నిరుడు లాక్డౌన్ నుంచి ఆ మహిళతో లివ్-ఇన్ రిలేషన్ లో  ఉన్నాడు. మహిళ చెప్పిన వివరాల ప్రకారం అతను ఆమె నుండి ఐదు లక్షల రూపాయలను దోచుకున్నాడు.

మార్టిన్ మీద ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), 344 (పది లేదా అంతకంటే ఎక్కువ రోజులు తప్పుగా నిర్బంధించడం), 376 (అత్యాచారం), 420 (మోసం), 506 (నేర బెదిరింపులకు శిక్ష) లకింద కేసు నమోదు చేశారు.