భారీ వర్షాల కారణంగా కేరళ మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటోంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమవ్వగా.. మరికొన్ని గ్రామాలకు బాహ్యా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. రన్‌వే పై నీరు ప్రవహిస్తూ ఉండటంతో.. ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు రాగల 24 గంటల్లో కొచ్చితో పాటు వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ జిల్లాలో అతి భారీవర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.