Asianet News TeluguAsianet News Telugu

కిస్ ఫెస్టివల్: అనుమతి నిరాకరించిన సర్కార్

జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్థులు ఎంతో కాలంగా కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 

Kiss ka kissa ends this year with ban on controversial kissing contest in Jharkhand
Author
Jharkhand, First Published Dec 16, 2018, 4:40 PM IST


రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్థులు ఎంతో కాలంగా కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. అయితే  ఈ ఏడాది నుండి  ఈ కిస్ ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్టు  అధికార బీజేపీ ప్రకటించింది.

ముద్దు ద్వారా తమ ప్రేమను వ్యక్త పర్చడం తమ ఆచారమని జార్ఖండ్‌లోని గిరిజనులు విశ్వసిస్తారు. ప్రతి ఏటా  డిసెంబర్ మాసంలో 
పాకూర్‌ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్తులు కిస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండీ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ముద్దు ఫెస్టివల్‌కు  బీజేపీ అనుమతులను నిరాకరించింది. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం భారతీయ గిరిజన సంస్కృతి కాదని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ రకమైన ముద్దుల ఫెస్టివల్ సమాజానికి తప్పుడు సంకేతాలను ఇస్తోందని  బీజేపీ ప్రకటించింది.

ఈ ఏడాది కిస్ ఫెస్టివల్ నిర్వహించేది లేదని స్థానిక జిల్లా ఎస్‌డీఓ జితేంద్రకుమార్ ఆదేశాలు  జారీ చేశారు.గత ఏడాది 18 జంటలు పబ్లిక్‌గా ముద్దుపోటీలో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios