గంగాపురం కిషన్ రెడ్డి: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్

Gangapuram Kishan Reddy Biography: తెలంగాణలో చాలా క్లాస్ లీడర్ గా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే రాజకీయ నాయకుడు. పదవులు కాదు కష్టపడి పనిచేయడమే ముఖ్యమని నమ్మే నేత. ఆ క్రమశిక్షణనే  నేడు ప్రధాని మోడీ గుర్తించేలా చేసింది.  రైతు కుటుంబం నుండి రాజకీయాలకు వచ్చినా.. నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. అతడే బీజేపీ ఎంపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యకుడు గంగాపురం కిషన్ రెడ్డి .  ఆయన  బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..

Kishan Reddy Biography, Age, Caste, Wife, Children, Family, Political career & More KRJ

Gangapuram Kishan Reddy Biography: తెలంగాణలో చాలా క్లాస్ లీడర్ గా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే రాజకీయ నాయకుడు. పదవులు కాదు కష్టపడి పనిచేయడమే ముఖ్యమని నమ్మే నేత. ఆ క్రమశిక్షణనే  నేడు ప్రధాని మోడీ గుర్తించేలా చేసింది.  రైతు కుటుంబం నుండి రాజకీయాలకు వచ్చినా.. నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. అతడే బీజేపీ ఎంపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యకుడు గంగాపురం కిషన్ రెడ్డి (Gangapuram Kishan Reddy ).  ఆయన  బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..

కిషన్ రెడ్డి జీవిత నేపథ్యం చూసుకుంటే.. 1964 మే 15న జి స్వామి రెడ్డి, ఆండలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్ లో డిప్లమా చేశారు. కిషన్ రెడ్డి 1995లో కావ్య వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం వైష్ణవి తన్మయి. 

Kishan Reddy Biography, Age, Caste, Wife, Children, Family, Political career & More KRJ
కిషన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్తానం


>> కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో యువ నాయకుడిగా చేరినా ఆయన..  1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచి భారతీయ జనతా పార్టీ తరపున తన సేవలు అందిస్తున్నారు.

>> 1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గా,  1984లో ప్రధాన కార్యదర్శి 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 1992లో జాతీయ నేతగా ఎదిగారు.

>>  భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో ఉపాధ్యక్ష పదవి 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందారు. 

>>  2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు.  2009 ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.  

>> 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టారు.  ఆ తర్వాత 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .

>> 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గ నుండి 62,000 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. Kishan Reddy Biography, Age, Caste, Wife, Children, Family, Political career & More KRJ

>>  2016 నుండి 2018 వరకు బిజెపి శాసనసభ నేత పనిచేస్తారు. మళ్ళీ 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి కాలరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు.

>>  2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ నుండి పార్లమెంట్ ఎంపీగా ఎన్నికయ్యారు.

>>  2021 లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు

గంగాపురం కిషన్ రెడ్డి బయోడేటా

పూర్తి పేరు: గంగాపురం కిషన్ రెడ్డి
పుట్టిన తేది: 15 మే 1964 (వయస్సు 59)
పుట్టిన స్థలం: తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా.
పార్టీ పేరు: భారతీయ జనతా పార్టీ
చదువు: టూల్ డిజైన్స్‌లో డిప్లొమా
వృత్తి: రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త
తండ్రి పేరు: స్వామి రెడ్డి గంగవరపు
తల్లి పేరు: అందాలమ్మ
జీవిత భాగస్వామి పేరు: కావ్య కిషన్ రెడ్డి
మతం: హిందూ
శాశ్వత చిరునామా: R/OH నెం-3-4-4, ఫ్లాట్ నెం-502, లెజెండ్ శ్రీలక్ష్మి వేరు. భూమన్నగల్లి, కాచిగూడ హైద్., AP 500027
ప్రస్తుత చిరునామా: ఇంటి సంఖ్య: 3-4-857, మోతీ అపార్ట్‌మెంట్స్, బర్కత్‌పురా, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, పిన్ 500 027
  Kishan Reddy Biography, Age, Caste, Wife, Children, Family, Political career & More KRJ

గంగాపురం కిషన్ రెడ్డి - ఆసక్తికరమైన విషయాలు

కిషన్ రెడ్డికి UNICEF నుంచి చైల్డ్-ఫ్రెండ్లీ లెజిస్లేటర్ బిరుదు లభించింది.
క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై ఓ పుస్తకం రాశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios