Asianet News TeluguAsianet News Telugu

కిసాన్ పరేడ్ : ఢిల్లీలోకి ప్రవేశించిన ట్రాక్టర్లు.. టిక్రీ వద్ద ఉద్రిక్తత..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కిసాన్ గణతంత్ర పరేడ్ కు సిద్దమయ్యారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. 

kisan parade tractors entered into delhi - bsb
Author
Hyderabad, First Published Jan 26, 2021, 11:29 AM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కిసాన్ గణతంత్ర పరేడ్ కు సిద్దమయ్యారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దేశ రాజధానిలో పరేడ్ కు సిద్దమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ - హరియాణా సరిహద్దు ప్రాంతమైన టిక్రీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాక్టర్ ర్యాలీలతో రైతులు, బారికేడ్లను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

మరోవైపు ర్యాలీలు పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో డిల్లీకి చేరుకున్నారు. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో భారీ కవాతు నిర్వహించేందుకు పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర్ ప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రాజ్ పథ్ లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే డిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లోని దీక్సా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టరలు ప్రదర్శనగా బయలుదేరనున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios