దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. కాంగ్రెస్ పై కిరణ్ రిజిజు ఫైర్
Kiren Rijiju : మహారాష్ట్రలోని సకోలిలో కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై, బాబా సాహెబ్ అంబేద్కర్ పై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.
Kiren Rijiju: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. సాకోలి అసెంబ్లీ నియోజకవర్గంలో తాను చేసిన ప్రసంగాన్ని రిజిజు షేర్ చేశారు. అందులో కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాకోలి నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు కంచుకోట. బాబాసాహెబ్ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని రిజిజు అన్నారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పలన్నారు.
రిజిజు ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
బీజేపీ నాయకుడు కిరణ్ రిజిజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూనే ఉందని అన్నారు. "నేటి దళిత-గిరిజన సమాజానికి చెందిన చదువుకున్న యువత ఇంటర్నెట్ లేదా లైబ్రరీలో బాబాసాహెబ్ నెహ్రూకు రాసిన లేఖను చదవాలి. రాహుల్ గాంధీ నాటకాల వల్ల ఏమీ జరగదు. మేము అంబేద్కర్ అనుచరులం. మేము కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళం, చదువుకుని, రాసి, పనిచేసేవాళ్ళం. కాంగ్రెస్ దళిత, గిరిజన సమాజాలను మోసం చేసింది. రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అందరితో మాట్లాడి ఎస్సీ-ఎస్టీలకు రిజర్వేషన్ నిబంధనను రూపొందించారు, కానీ అదే రిజర్వేషన్ ను పండిట్ నెహ్రూ వ్యతిరేకించారు. ఆ తర్వాత, ఓబిసి రిజర్వేషన్ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు, రాజీవ్ గాంధీ లోక్‌సభలో నిలబడి దానిని వ్యతిరేకించారు. నేడు రాహుల్ గాంధీ, ఆయన అనుచరులు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956లో మన మధ్య నుంచి వెళ్లిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి, కాంగ్రెస్ మనకు కారణం చెప్పాలి" అని అన్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఘన విజయం