బీహార్‌కు చెందిన తబ్రేజ్ ఆలం అనే వ్యక్తి.. తొమ్మిది నెలల బాలిక, రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఖాట్మండు : ఒక పసికందుతో సహా ఇద్దరు నేపాలీ పిల్లలను గోనె సంచులలో భారత్‌కు అక్రమ రవాణా చేశాడన్న ఆరోపణలపై 22 ఏళ్ల భారతీయుడిని దక్షిణ నేపాల్‌లోని బారా జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

బీహార్‌కు చెందిన తబ్రేజ్ ఆలం ఆదివారం నాడు తొమ్మిది నెలల ఆడపిల్లను, రెండేళ్ల బాలుడిని గోనెసంచిలో బలవంతంగా తీసుకెళ్తుండగా సాయుధ పోలీసు బలగాలు పట్టుకున్నట్లు ఆర్మ్‌డ్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ రాజేంద్ర ఖడ్కా తెలిపారు. 

మానసిక చికిత్సలో ఉన్న ఢిల్లీ అత్యాచార బాధితురాలు.. షాక్ నుంచి కోలుకోని చిన్నారి...

ఆలం నేపాల్-భారత్ సరిహద్దు వెంబడి జిల్లాలోని దేవతాల్ రూరల్ మునిసిపాలిటీ నుండి పిల్లలను ఒక గోనె సంచిలో భారత్ కి తీసుకువెళుతున్నాడని మిస్టర్ ఖడ్కా చెప్పారు. గ్రామీణ మునిసిపాలిటీలోని అమ్వా గ్రామం నుండి ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆరోపణలపై భారత జాతీయుడిని అరెస్టు చేసినట్లు ఖడ్కా తెలిపారు.

పారామిలటరీ సంస్థకు చెందిన బృందం గోనెలోంచి వారి కేకలు విన్న తర్వాత సాయుధ పోలీసు ఫోర్స్ ఆలంను పట్టుకుని పిల్లలను రక్షించింది. పిల్లలను రక్షించిన తర్వాత వారి కుటుంబాలకు అప్పగించారని ఖడ్కా తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఆలమ్‌ను బారా జిల్లా పోలీసు కార్యాలయానికి అప్పగించారు.