Asianet News TeluguAsianet News Telugu

లోన్ యాప్ వ్యవహారం.. అశ్లీల సంభాషణకు 1600 సిమ్ కార్డ్ లు

చైనాకు చెందిన జియాఎమో (38), ఊయాన్‌లున్‌ (28), బెంగుళూరుకు చెందిన ప్రమోద (28), పవన్‌ (27) అనే వారి సహాయంతో వెంటనే లోన్‌ అందజేసే 50కి పైగా యాప్‌లు నడిపారు. 
 

Key Information Out Over Loan App Gang
Author
Hyderabad, First Published Jan 7, 2021, 1:51 PM IST

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ల వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఓ వ్యక్తి ఏకంగా.. ఈ లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నందుకు వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. కాగా.. ఈ విషయంలో మరిని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

లోన్‌ యాప్‌ ద్వారా పలు కోట్లు కందు వడ్డీ వసూలుచేసి ప్రజలను వేధింపులకు గురిచేసిన చైనా దేశపు ముఠా అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు నకిలీ దస్తావేజులతో 1,600 సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. చైనాకు చెందిన జియాఎమో (38), ఊయాన్‌లున్‌ (28), బెంగుళూరుకు చెందిన ప్రమోద (28), పవన్‌ (27) అనే వారి సహాయంతో వెంటనే లోన్‌ అందజేసే 50కి పైగా యాప్‌లు నడిపారు. 

వీటి ద్వారా కందు వడ్డీ వసూలుచేశారు. రుణాలు తిరిగి చెల్లించని వారిని మొబైల్‌ ఫోన్‌లో సంప్రదించి ఆశ్లీల పదజాలంతో బెదిరించేందుకు 110 మంది ఉద్యోగులతో నకిలీ కాల్‌ సెంటర్లు నడిపారు. వారిని ఈ నెల 2వ తేది చెన్నై కేంద్ర క్రైం విభాగం పోలీసులు అరెస్ట్‌ చేసి పుళల్‌ జైలుకు తరలించారు.

పోలీసుల విచారణలో, వీరికి చైనాకు చెందిన హాంగ్‌ అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. హాంగ్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా తన కింద పనిచేసే వారిని పర్యవేక్షిస్తు వచ్చాడు. ఇతని ఆధ్వర్యంలో చైనాకు చెందిన ఛీటింగ్‌ ముఠా పనిచేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా బెంగుళూరు, చెన్నైలో కార్పొరేట్‌ ఉద్యోగుల పేరుతో నకిలీ ఆధారాలు అందజేసి 1,600 సిమ్‌ కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసేందుకు సహాయపడిన సమాచార శాఖ ఉద్యోగులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios