Asianet News TeluguAsianet News Telugu

లాటరీలో పది కోట్లు గెలిచిన కేరళ మహిళ.. 28 ఏళ్ల క్రితం తండ్రికి కూడా..

కేరళ మహిళకు అదృష్టం తలుపు తట్టింది. లాటరీలో ఏకంగా పది కోట్లు గెలుచుకుంది. త్రిసూర్ జిల్లాకు చెందిన వత్సల విజయన్‌ భర్త క్యాన్సర్‌తో మరణించాడు. అయితే ఆమెకు లాటరీ టిక్కెట్లు కొనడం అలవాటు.. అలా నాలుగేళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేది

Kerala Women wins Rs 10 crore Onam Bumper Lottery
Author
Thrissur, First Published Sep 21, 2018, 10:59 AM IST

కేరళ మహిళకు అదృష్టం తలుపు తట్టింది. లాటరీలో ఏకంగా పది కోట్లు గెలుచుకుంది. త్రిసూర్ జిల్లాకు చెందిన వత్సల విజయన్‌ భర్త క్యాన్సర్‌తో మరణించాడు. అయితే ఆమెకు లాటరీ టిక్కెట్లు కొనడం అలవాటు.. అలా నాలుగేళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేది.

ఈ నేపథ్యంలో  నెల క్రితం త్రిసూర్ వెస్ట్‌ఫోర్ట్ దగ్గర టికెట్ కొనింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఓనమ్ బంపర్ లాటరీలో వత్సలకు రూ.10 కోట్ల లాటరీ తగిలినట్లు ఏజెంట్ బుధవారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన వత్సలకు ఏం చేయాలో అర్ధం కాలేదు.

అయితే బహుమతి అందుకునే వరకు లాటరీ టికెట్‌ను జాగ్రత్తగా దాయాలి. ఎందుకంటే ఆ టికెట్ ఉన్న వారికే డబ్బును చెల్లిస్తుంది ప్రభుత్వం. దీంతో ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు, అల్లుడు‌ లాటరీ విషయాన్ని బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఆమె పెద్ద కొడుకు వినీష్ లాటరీ టికెట్‌ను పెయింట్ డబ్బాలో దాచిపెట్టి... స్థానిక ఎస్‌బీఐలో జమ చేశాడు.

బహుమతి మొత్తం ఖాతాలో పడటానికి మూడు నెలల సమయం పడుతుందని బ్యాంక్ సిబ్బంది తెలియజేశారు. రూ.10 కోట్ల లాటరీలో ఒక కోటి ఏజెంట్ కమిషన్, ఇతర ట్యాక్సులు పోను మొత్తం 6.5 కోట్ల వత్సలకు వస్తుంది.. ఈ సొమ్ముతో త్వరలో తాను ఒక మంచి ఇంటిని కొంటానని తెలిపింది. తన తండ్రికి 28 సంవత్సరాల క్రితం లాటరీలో రూ.10 లక్షలు వచ్చాయని.. ఆ డబ్బుతో ఆయన ఆరుగురు కుమార్తెల పెళ్లిళ్లు చేశారని వత్సల తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios