ముంబై ఉగ్రదాడిని కేరళకు చెందిన ఓ రచయిత సమర్థించారు. ముంబై చెడ్డదని.. అలా జరగాల్సిందేనని వ్యాఖ్యానించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

కేరళకు చెందిన ఓ మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. ముంబయి ఉగ్రదాడిని సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

కేరళలోని తిరువనంతపురానికి చెందిన రచయిత ఆష్లిన్‌ జిమ్మీ... భారత్‌పై పాకిస్థాన్‌ టెర్రరిస్టుల దాడిని సమర్థించింది. ముంబయిపై పాక్‌ ఉద్రవాదులు దాడి చేయడం సబబేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ముంబయి మంచి ప్లేస్‌ కాదని.. తనకు సినిమాల్లో అవకాశం ఇవ్వలేదని.. అందుకే ముంబయిపై ఉగ్రదాడి సహేతుకమని జిమ్మీ వ్యాఖ్యానించింది. బాలీవుడ్‌ స్టార్స్‌ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ లాంటవవారితో కలిసి నటించే అవకాశం తనకు రాలేదని.. అందుకే ముంబయిపై ఎటాక్‌ జరగాల్సిందేని ఓ వీడియా సంభాషణలో ఆమె సమర్థించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Scroll to load tweet…

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో హీరోయిన్ కావాలనే తన కలను సాధించలేకపోయినందుకు జిమ్మీ నిరాశ చెందింది. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ల హీరోయిన్‌గా తనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ముంబై చెడ్డదని ఆమె వాదించింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. సోషల్‌ మీడియాలో జిమ్మీ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ఆమె అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడంపై చర్యలు తీసుకోవాలని అధికారులను నెటిజన్లు కోరుతున్నారు.