Asianet News TeluguAsianet News Telugu

సినిమాటిక్ స్టోరీ... వివాహితపై కన్ను.. ఒప్పుకోలేదని..!

కేరళలో ఓ మహిళను ఇలానే ఓ వ్యక్తి పెళ్లి అంటూ వెంట పడ్డాడు. అంగీకరించలేదని.. ఆమెకు తెలీకుండానే ఆమెను సమస్యల్లోకి నెట్టేశాడు.

Kerala woman framed in narcotics case for turning down marriage proposal
Author
Hyderabad, First Published Jul 5, 2021, 9:48 AM IST

చాలా సినిమాల్లో చూసే ఉంటారు. హీరోయిన్ పై విలన్ కన్ను వేస్తాడు. పెళ్లి చేసుకుంటానని వెంట పడితే.. అందుకు ఆమె అంగీకరించదు. దీంతో.. ఆమెను ఇబ్బంది పెట్టడం.. తన దారికి తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చంగా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కేరళలో ఓ మహిళను ఇలానే ఓ వ్యక్తి పెళ్లి అంటూ వెంట పడ్డాడు. అంగీకరించలేదని.. ఆమెకు తెలీకుండానే ఆమెను సమస్యల్లోకి నెట్టేశాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన  శోభా విశ్వనాథ్... ఓ దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది. ఆమెకు పెళ్లి కాగా.. కొన్ని కారణాలతో భర్తకు దూరమైంది. ప్రస్తుతం భర్తతో విడాకులు కేసు కోర్టులో నడుస్తోంది. కాగా.. ఈ క్రమంలో జనవరి 21న ఆమె దుకాణంలో పోలీసులకు గంజాయి పొట్లాలు కనిపించాయి. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శోభ దుకాణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. అక్కడ పనిచేసే ఒక పని మనిషి అనుమానాస్పదంగా ప్రవర్తించడం పోలీసుల కంటపడింది. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆ గంజాయి తానే దుకాణంలో పెట్టానని, తనను అలా చేయాలని వివేక్ అనే యువకుడు చెప్పాడని ఆమె తెలిపింది.

ఆ వివేక్ కూడా శోభ దుకాణంలోనే గతంలో పనిచేసేవాడు. కానీ దుకాణంలో డబ్బు లెక్కలు మార్చి, తన జేబులు నింపుకోవడంతో అతన్ని ఉద్యోగంలో నుంచి శోభ తొలగించింది. వివేక్‌ను విచారించగా.. సినిమా కథ వంటి స్టోరీ బయటపడింది. 

ఇక్కడ స్థానికంగా ఉన్న లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. యూకే పౌరుడైన అతని పేరు హరీష్ హరిదాస్. ఇటీవల భర్తకు దూరంగా ఉంటున్న శోభను ఇటీవల కలిసిన హరీష్.. తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. దీనికి శోభ ఒప్పుకోలేదు. దీంతో కక్షపెట్టుకున్న హరీష్.. ఆమెను ఈ గంజాయి కేసులో ఇరికించాడు. అతనే గంజాయి ప్యాకెట్లను వివేక్ ద్వారా శోభ దుకాణంలో పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వివేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. హరీష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios