Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక బాంబు పేలుళ్లలో కేరళ మహిళ మృతి

శ్రీలంక పేలుళ్లలో మరణించిన మహిళను కాసర్‌గోడ్‌లోని మొగ్రాల్‌ పుత్తూరుకు చెందిన రజీనాగా గుర్తించారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో రజీనా మృతి చెందినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

Kerala woman dies in Srilanka blasts
Author
Thiruvananthapuram, First Published Apr 21, 2019, 8:40 PM IST

తిరువనంతపురం: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో కేరళకు చెందిన ఓ మహిళ మృత్యువాత పడింది.ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 207 మంది దాకా మృత్యువాత పడ్డారు. 

శ్రీలంక పేలుళ్లలో మరణించిన మహిళను కాసర్‌గోడ్‌లోని మొగ్రాల్‌ పుత్తూరుకు చెందిన రజీనాగా గుర్తించారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో రజీనా మృతి చెందినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

కొలంబో ఉన్న తమ బంధువులను కలవడం కోసం రజీనా అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే రజీనా మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీలంకలో జరిగిన మరణహోమాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. 

శ్రీలంకలోని రజీనా బంధువులతో, భారత హైకమిషన్‌ అధికారులతో తమ సిబ్బంది చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. శ్రీలంక ఘటన మృతుల్లో 39 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios