Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పార్టీ కార్యాలయంలోనే దారుణం... మహిళా కార్యకర్తపై అత్యాచారం

అప్పుడే పుట్టిన ఓ పసిగుడ్డును నడిరోడ్డుపై వదిలేసిన తల్లిదండ్రుల గురించి గాలిస్తున్న పోలీసులకు మరో సంచలన నిజం తెలిసింది. పాపం...ఆ తల్లి కూడా ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఓ జాతీయస్థాయి పొలిటికల్ పార్టీ కార్యలయంలో ఈ అఘాయిత్యం జరిగినట్లు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ దారుణం కేరళలో  చోటుచేసుకుంది. 

Kerala woman alleges rape inside CPI(M)  office
Author
Palakkad, First Published Mar 21, 2019, 5:38 PM IST

అప్పుడే పుట్టిన ఓ పసిగుడ్డును నడిరోడ్డుపై వదిలేసిన తల్లిదండ్రుల గురించి గాలిస్తున్న పోలీసులకు మరో సంచలన నిజం తెలిసింది. పాపం...ఆ తల్లి కూడా ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఓ జాతీయస్థాయి పొలిటికల్ పార్టీ కార్యలయంలో ఈ అఘాయిత్యం జరిగినట్లు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ దారుణం కేరళలో  చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  కేరళలోని పాలక్కడ్ జిల్లా చెర్పులసేరి పట్టణానికి చెందిన ఓ 21 ఏళ్ల యువతి వామపక్ష అనుభంద విద్యార్థి విభాగానికి చెందిన ఎస్ఎఫ్ఐలో కార్యకర్తగా పనిచేసేది. ఈ క్రమంలో ఆమె తరచూ సిపిఐ(ఎం) పార్టీ కార్యాలయానికి వెలుతుండేది. ఇలా ఓ రోజు ఆమె తమ కాలేజి మ్యాగజైన్ రూపొందించే క్రమంలో భాగంగా పార్టీ కార్యాలయానికి వెళ్లింది. అయితే ఆమె ఒంటరిగా అక్కడికి వెళ్లడంతోయ దీన్ని అదునుగా భావించిన ఓ కార్యకర్త అదే కార్యాలయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఈ విషయం బయటపడితే తన జీవితం నాశనమవుంతుందన్న భయంతో సదరు యువతి ఈ అఘాయిత్యం గురించి ఎక్కడ బయటపెట్టలేదు. కానీ అత్యాచారం మూలంగా ఆమె పెళ్లి కాకుండానే గర్భవతిగా మారింది. ఇలా జన్మనిచ్చిన బిడ్డను నడిరోడ్డుపై వదిలేని వెళ్లింది. ఇలా ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాధిత యువతి నుండి పిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ ఘటనపై పార్టీ తరపున కూడా విచారణకు ఆదేశించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తేలేదని పోలీసులు, పార్టీ నాయకులు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios