కేరళ టెలివిజన్ నటి నిత్యా శశి హనీ ట్రాప్‌లో చిక్కుకుంది. వృద్ధుడిని హనీ ట్రాప్ చేసి రూ.11 లక్షలు మోసం చేసిన కేసులో టెలివిజన్ నటి నిత్యాశశి, ఆమె స్నేహితురాలు బీనును పరవూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
కొంతమంది కిలేడీలు తమ అందాలను ఏరగా వేసి.. అవతల వారి నుంచి డబ్బులు గుంజుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇటీవల ఇలాంటివి అనేక ఘటనలు తెర మీదికి వస్తున్నాయి. తాజా ఓ కేరళ నటి కూడా తన అందాన్ని వలగా వేసి డబ్బులు లాగే ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆ నటి హనీ ట్రాపింగ్ కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. టెలివిజన్ నటి నిత్యా శశి హనీ ట్రాప్‌లో చిక్కుకుంది. వృద్ధుడిని హనీ ట్రాప్ చేసి రూ.11 లక్షలు మోసం చేసిన కేసులో టెలివిజన్ నటి నిత్యాశశి, ఆమె స్నేహితురాలు బీనును పరవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లాం లోని పరవూర్‌లో ఓ వృద్ధుడిని హనీ ట్రాప్ చేసి రూ.11 లక్షలు దోచుకున్నారనే ఆరోపణలతో ఒక టెలివిజన్ నటి,ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంలోని పట్టోమ్‌లో నివసిస్తున్న 75 మాజీ సైనికుడు, అతడు కేరళ విశ్వవిద్యాలయ మాజీ ఉద్యోగి. నిత్యా నటిగానే కాకుండా న్యాయవాది కూడా. ఈ మొత్తం వ్యవహారం మే 24 నుంచి మొదలైంది. ఫిర్యాదుదారుడు ఒక స్థలంలో అద్దెకు ఇల్లు పొందడానికి ప్రయత్నిస్తుండగా.. ఈ సమయంలో నిత్య అతనికి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆమె అతడ్ని కలిసింది.
తరుచూ టచ్ లో ఉంటూ.. స్నేహంగా మెదిలింది. నిత్య ఇంట్లోనే బెదిరించి పూర్తిగా బట్టలు విప్పేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని తరువాత నటి స్నేహితురాలు బిను ఫోటోలు తీసింది. ఈ క్రమంలో ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ.. నిత్య రూ.25 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆ వృద్ధుడు వారికి రూ.11 లక్షలు వరకు ఇచ్చాడు. అయినా.. డబ్బుల కోసం డిమాండ్ కొనసాగడంతో వృద్ధుడు జులై 18న పరవూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనంతరం వారిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారు. పోలీసుల సూచనల మేరకు మిగిలిన డబ్బు చెల్లిస్తానంటూ నిత్య, బినులను పట్టంలోని తన ఫ్లాట్‌కు పిలిపించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో హాట్ టాఫిక్ గా మారింది.
