పెళ్లి అనేది జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే కొందరు వారి పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో.. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ (Post-wedding photoshoot) కామన్‌గా మారిపోయాయి.

పెళ్లి అనేది జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవాలని చాలా మంది భావిస్తారు. అందుకే పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో.. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ (Post-wedding photoshoot) కామన్‌గా మారిపోయాయి. అయితే కొన్నిసార్లు ఈ ఫోటో షూట్‌లు ఊహించని రీతిలో విషాదాన్ని నింపుతున్నాయి. తాజగా ఇలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని జానకికాడు సమీపంలోని కుట్టియాడి నదిలో పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ ‌చేస్తుండగా నవ జంట నీళ్లలో పడి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య తీవ్ర గాయాలో చికిత్స పొందుతుంది. 

పేరంబ్రా సమీపంలోని కడియంగడ్‌కు రెజిల్‌కు మార్చి 14న కార్తీకతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేపట్టాలని చూసినా.. పలు కారణాలతో వాయిదా పడింది. చివరకు సోమవారం ఉదయం ఫోటో షూట్ కోసం.. కుట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతున్న సమయంలో ఇద్దరు జారిపడి నడిలో పడిపోయారు. అయితే వారి కేకలు విన్న స్థానికులు.. వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. నీళ్లలో మునిగిన వారిద్దరిని బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అయితే రెజిల్‌ మరణించగా.. కార్తీక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

ఈ ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలోని కుట్టియాడి నది నీటి అడుగున లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని కొందరు పర్యాటకులు ఆ గుంతల్లో చిక్కుకుని మరణించారు. రెజిల్ కూడా గుంతల్లో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు. 

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర పనుల కారణంగా నవ జంట అవుట్ డోర్ వెడ్డింగ్ షూట్‌ను ఏప్రిల్ 4కి వాయిదా వేసుకున్నట్టుగా తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు షూటింగ్‌ ప్రారంభమైందని చెప్పారు. ఇక, ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.