Asianet News TeluguAsianet News Telugu

వాటే ఐడియా సర్ జీ : బన్నీని వాడేసిన కేరళ పోలీసులు.. ప్రజల కోసమేలెండి..!!

పోలీసులు మంచి పనుల కోసం అప్పుడప్పుడూ సెలబ్రెటీల సాయం కోరుతూ వుంటారు. వారు కూడా సమాజ హితం కోరి ప్రభుత్వానికి సాయం చేస్తూ వుంటారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడంతో పాటు కరోనా సమయంలోనూ సినీతారలు, ఇతర ప్రముఖులు ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రచారం చేశారు. 

kerala police used allu arjun entry scene from racegurram ksp
Author
Thiruvananthapuram, First Published Feb 20, 2021, 8:09 PM IST

పోలీసులు మంచి పనుల కోసం అప్పుడప్పుడూ సెలబ్రెటీల సాయం కోరుతూ వుంటారు. వారు కూడా సమాజ హితం కోరి ప్రభుత్వానికి సాయం చేస్తూ వుంటారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడంతో పాటు కరోనా సమయంలోనూ సినీతారలు, ఇతర ప్రముఖులు ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రచారం చేశారు. 

తాజాగా కేరళ పోలీసులు ఓ పనికోసం స్టైలిష్ స్టార్‌ను వినియోగించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘పోల్ యాప్‌’ను (పోలీస్ యాప్)‌ కేరళ పోలీస్ శాఖ రూపొందించింది. అయితే దీనిని జనంలోకి తీసుకు వెళ్లడానికి అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలోని ఓ సీన్‌తో చిన్న వీడియో రూపొందించారు. 

ఆ వీడియోలో హీరో కుటుంబం ఓ వాహనంలో చిక్కుకుపోతుంది. దాన్నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటుంది. ఆ వాహనాన్ని ఢీ కొట్టడానికి విలన్‌లు మరో వాహనంలో వస్తుంటారు.

అదే సమయంలో పోల్ యాప్‌ను ప్రెస్ చేయగా.. పోలీస్ డ్రెస్‌లో ఉన్న అల్లు అర్జున్ వారికి ఎదురుగా వస్తాడు. ఒక్కసారిగా విలన్‌లు భయపడిపోయి సడన్ బ్రేక్ వేస్తారు. అలా తన కుటుంబాన్ని హీరో రక్షించుకుంటాడు. 

పోల్ యాప్‌ కిందకు అన్నీ శాఖలను అందుబాటులోకి తీసుకువచ్చామని కేరళ పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఈ యాప్‌ను వినియోగిస్తే.. తాము వేగంగా ఘటనా స్థలానికి చేరుకుంటామని చెప్పడానికి కేరళ పోలీసులు అల్లు అర్జున్ మూవీ సీన్‌తో వీడియోను రూపొందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోకు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios