Asianet News TeluguAsianet News Telugu

కేరళకు మరో గండం: నిన్నటి దాకా వరదలు... నేడు కరువు

నిత్యం పచ్చని చెట్లతో కళకళలాడే కేరళకు కరువు గండం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు  నిపుణులు.. నిన్నటి వరకు పొంగిపోర్లిన రాష్ట్రంలోని ప్రధాన నదులైన పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతగా నీటిమట్టం పడిపోయింది. 

kerala now faces drought conditions
Author
Thiruvananthapuram, First Published Sep 13, 2018, 9:24 AM IST

నిత్యం పచ్చని చెట్లతో కళకళలాడే కేరళకు కరువు గండం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు  నిపుణులు.. నిన్నటి వరకు పొంగిపోర్లిన రాష్ట్రంలోని ప్రధాన నదులైన పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతగా నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి..

అలాగే నేలను గుళ్లబారేలా చేసి రైతులకు సాయపడే వానపాముల జాడ కనిపించకుండా పోయింది. కరువు జాడలు కనిపిస్తుండటంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు.. రాష్ట్రంలో ఈ భయానక పరిస్థితి తలెత్తడానికి గల కారణాలను అన్వేషించాలని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు.

ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన..  ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అలాగే నీటిమట్టం తగ్గిపోవడంపై జలవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని సీఎం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios