Asianet News TeluguAsianet News Telugu

మైనర్ మేనకోడలిపై అత్యాచారం.. నిందితుడికి 66 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ మేనకోడలిని  లైంగికంగా వేధించినందుకు ఒక వ్యక్తికి కోర్టు 66 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన ఇడుక్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి టిజి వర్గీస్ .. నిందితుడికి  66 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.

Kerala Man Gets 66 Years In Jail For Sexually Abusing Minor Niece
Author
First Published Jan 11, 2023, 5:58 AM IST

మ‌హిళలు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా వారిపై దాడులు ఆగ‌డం లేదు. నిరంత‌రం ఎక్క‌డో ఓ చోట దారుణం వెలుగులోకి వస్తుంది. చిన్నారులు, ముసలి వారు అనే తేడా లేకుండా.. కామాంధులు వారిపై లైంగిక దాడి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కామ‌వాంఛ‌తో మ‌గాళ్లు మృగాలుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన వారికి శిక్ష‌లు కూడా తొంద‌ర‌గా ప‌డ‌టం లేదు. ఈ కార‌ణంగా కూడా నేర‌స్తుల్లో భ‌యం క‌ల‌గ‌డం లేదు. తత్ఫ‌లితంగా.. చిన్నారులు, మ‌హిళ‌పై దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మైనర్ మేనకోడలుపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కోర్టు కఠినంగా వ్యవహరించింది. నిందితుడికి ఏకంగా 66 ఏళ్ల జైలు శిక్షవిధించింది. 

మైనర్ మేనకోడలుపై అత్యాచారం కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి ఏకంగా.. 66 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటనపై మంగళవారం ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరగగా.. జస్టిస్‌ టీజీ వర్గీస్‌ తీర్పు చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) , లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద దోషులకు వేర్వేరుగా 66 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే.. శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని, కాబట్టి అతను 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) షిజో మోన్ జోసెఫ్ తెలిపారు. అదే సమయంలో కోర్టు దోషికి రూ.80,000 జరిమానా కూడా విధించింది. దీంతో పాటు బాధితురాలికి పునరావాసం కోసం రూ.50 వేలు చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది. దోషి తన మేనకోడలుపై 2021లో ఆమె ఇంట్లో అత్యాచారం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు ఆ బాలికకు మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ సమయంలో బాధితురాలి వయస్సు 17 సంవత్సరాలు. అంటే ఆమె మైనర్.

అల్వార్‌లో మైనర్‌పై అత్యాచారం .. 20 ఏళ్ల జైలు శిక్ష

మరోవైపు నకిలీ సీబీఐ అధికారిగా మారిన అత్యాచారం నిందితులకు రాజస్థాన్‌లోని అల్వార్‌లోని పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోషన్ దీన్ ఖాన్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8, 2021న భివాడిలో కేసు నమోదైందని, ఇందులో అల్వార్‌లోని బరోదమేవ్‌లో నివాసం ఉంటున్న నవీన్ శర్మ తాను సిబిఐ అధికారినని బాలికకు తెలిపాడు. ఈ విధంగా మైనర్ బాలికను మోసం చేశాడు.

బాలిక చిన్న స్కేలు కోసం బస్టాండ్ సమీపంలోని గ్వాడే వద్దకు వెళ్లగా, ఆమెకు మత్తు మందు తినిపించి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఆమెను తన వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఈరోజు పోక్సో కోర్టు నెం.1 ప్రత్యేక న్యాయమూర్తి అనూప్ పాఠక్ నిందితుడు నవీన్ శర్మకు వివిధ సెక్షన్లలో 20 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచారు. అంతేకాకుండా.. రూ.1,11,000 జరిమానా కూడా విధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios