కేరళ నరబలి కేసులో నిందితుడిగా ఉన్న భగవాల్ సింగ్ గురించి విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఫేస్ బుక్ లో ఎప్పుడూ కవితలు పోస్టు చేస్తుంటారని తెలిసింది.
కేరళలో ఇద్దరు మహిళలను చిత్రహింసలకు గురిచేసి చంపి, నరబలి ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్లో ఒకరైన భగవాల్ సింగ్ తరచుగా ఫేస్‌బుక్‌లో కవితలు పోస్టు చేస్తుంటారని విచారణలో తెలిసింది. అలాగే ఆయన ప్రత్యామ్నాయ వైద్యంలో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆయనకు ఇప్పుడు 60 సంవత్సరాలు. సామాజిక కార్యకర్తగా నగరంలో మంచి పేరు ఉంది. అందరితో వినయంగా ఉంటారని గుర్తింపు ఉంది.
ఆయనను స్నేహితులు సాంప్రదాయ వైద్యుడు, కవి, అని పిలుస్తుంటారు. ఇరుగుపొరుగున ఉండే వారు ఆయనను ‘‘పెద్దమనిషి’’అని పిలుస్తారు. కానీ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భయంకరమైన హత్యలలో పాత్ర పోషించారు.
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం.. రేస్ అటాక్ అంటున్న తల్లిదండ్రులు..
ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ముహమ్మద్ షఫీ లైంగికంగా వక్రబుద్ధి కలిగిన, సాధువుగా గుర్తింపు ఉంది. ఆయన బాధితుల కోసం వల వేసిన శాడిస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. భగవల్ సింగ్, లైలా వారి ఆర్థిక ఇబ్బందులను అంతం కావాలంటే నరబలి చేయాల్సి ఉంటుందని వారిని ఒప్పించాడు.
ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దారుణమైన హత్యలపై పోలీసులు విచారిస్తున్న సమయంలో భగవాల్ సింగ్, అతడి భార్య లైలా ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఒక్క సారిగా గుమిగూడారు. ఆ ఇంటికి పొరుగున నివసించే ఉష మాట్లాడుతూ.. ‘‘మా కమ్యూనిటీలో ఈ జంట బాగా చదువుకున్నారు, బాగానే ఉండేవారు. కానీ ఈ ఆలోచన గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు. వారు అలాంటి స్థాయికి దిగజారినట్లు కనిపించడం లేదు ’’ అని చెప్పారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.
ఆయన వైద్యుల గౌరవప్రదమైన కుటుంబానికి చెందినవాడని మరో వ్యక్తి ఆనందన్ చెప్పారు. ‘‘ అతడు ఎవరితోనూ కోపంతో మాట్లాడటం మేము ఎప్పుడూ వినలేదు. అతడి పూర్వీకులు చాలా ప్రసిద్ధ సాంప్రదాయ మసాజర్లు. పాత రోజుల్లో ప్రజలు ఆసుపత్రులకు బదులుగా వారి వద్దకు వెళ్ళేవారు ’’ అని తెలిపారు.
కాగా.. భగవల్ సింగ్‌కు సీపీఎంతో సంబంధం ఉంది. కానీ ఆ పార్టీ దీనిని ఖండించింది. అతడు తమ పార్టీ సభ్యుడు కాదని పేర్కొంది. అయితే ఆ పార్టీ ఆ ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఆయన ఫేస్‌బుక్ పేజీ నిండా ‘‘హైకూ’’ అని లేబుల్ చేసిన సంక్షిప్త రూప కవిత్వం, జపనీస్ కవిత్వం ఉన్నాయి.
నరబలి ఘటన జరిగిన వారం రోజుల తరువాత కూడా అంటే అక్టోబర్ 6వ తేదీన కూడా ఆయన చివరిగా ఫేస్ బుక్ లో కవితలు పోస్ట్ చేశారు. అందులో మలయాళంలో రెండు నిగూఢమైన పద్యాలను పోస్ట్ చేశాడు. అందులో ఒక కొలిమి, పనిలో ఉన్న కమ్మరి భార్య, ఆమె శరీరం వంగి ఉంది. ఆయనకు ఫేస్‌బుక్‌లో 1,100 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
భగవల్ సింగ్ కేరళ విశ్వవిద్యాలయం, సెయింట్ థామస్ కాలేజీ, కోజెంచేరిలో చదివాడు. కాగా.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును ఆయన కుటుంబం పెట్టిందని, కానీ తరువాత పేరు మార్పునకు గురయ్యిందని కొచ్చి పోలీస్ చీఫ్ నాగరాజు చెప్పారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. కాగా.. లైలా ఆయనకు రెండో భార్య. ఆయనకు మొదటి భార్య ద్వారా ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు విదేశాలలో పని చేస్తున్నారు.
మాస్కో-డిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు: దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న షపీ తనను తాను ప్రజలను ధనవంతులను చేసే క్షుద్ర నిపుణుడిగా పేర్కొంటూ ఫేస్‌బుక్ ద్వారా భగవల్ సింగ్‌ను సంప్రదించాడని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు బాధితులైన రోజిలిన్, పద్మలను సింగ్ ఇంటికి రప్పించాడని షఫీ ఆరోపించాడు. కాగా.. రోజిలిన్ జూన్ 6న, పద్మ సెప్టెంబర్ 26న హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి పట్టణం తిట్టలోని ఇంటి పెరట్లో పాతిపెట్టారు. అయితే విచారణ సందర్భంగా పోలీసులు భగవల్ సింగ్ ని ప్రశ్నించినప్పుడు ఆ జంట హత్యలను అంగీకరించారు. మహిళల అవశేషాలను ఎక్కడ ఖననం చేశారో సింగ్ చూపించారు.
