Asianet News TeluguAsianet News Telugu

కేరళ నరబలి కేసు: పోస్టుమార్టం పూర్తి.. వెలుగులోకి మ‌రిన్ని విష‌యాలు

Kerala: కేర‌ళ న‌ర‌బ‌లి కేసులో మృత‌దేహాల‌కు పోస్టుమార్టం పూర్త‌యింద‌ని స‌మాచారం. బాధితుల్లో ఒకరైన రోస్లిన్‌కు అస్థిపంజరం మాత్రమే లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో బాధితురాలు పద్మ మృతదేహం 56 ముక్కలుగా లభ్యమైంది. ఆదూర్ ఆర్డీవో పోస్టుమార్టం అనంతరం విధివిధానాలు పూర్తి చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
 

Kerala Human Sacrifice Case: Postmortem Completed.. More Things Come to Light
Author
First Published Oct 14, 2022, 1:01 AM IST

Kerala human sacrifice case: కేర‌ళ‌లోని న‌ర‌బ‌లి కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసులో ద‌ర్యాప్తులో మ‌రిన్ని విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని మీడియా రిపోర్ట‌లు పేర్కొంటున్నాయి. పాతనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో జరిగిన దారుణమైన నరబలి కేసు దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 11న వెలికి తీసిన ఇద్దరు మహిళల మృతదేహాలకు పోస్ట్‌మార్టం గురువారం పూర్తయిందని కొట్ట‌యం మెడికల్ కాలేజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంత‌కుముందు ఎలంతూరు నుంచి తీసుకొచ్చిన మృత‌దేహాల‌కు  కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో పోస్టుమార్టం బుధవారం ప్రారంభమైంది.

బాధితుల్లో ఒకరైన రోస్లిన్‌ అస్థిపంజరం మాత్రమే లభ్యమవగా, రెండో బాధితురాలు పద్మ మృతదేహం 56 ముక్కలుగా లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. "రోస్లిన్ పోస్ట్‌మార్టం బుధవారం పూర్తయింది. గురువారం పద్మ మృతదేహంపై పోస్టుమార్టం పూర్తయింది. అవి మహిళల మృతదేహాలు అని నిర్ధారించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వైద్య విచారణలో జాప్యం జరిగిందని" సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆదూర్ ఆర్డీవో పోస్టుమార్టం అనంతరం విధివిధానాలు పూర్తి చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

క్షతగాత్రుల స్వభావం, మృతుల అంతర్గత అవయవాలకు సంబంధించిన వివరాలతో సహా పోస్టుమార్టం నివేదికను త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందజేయనున్నట్లు స‌మాచారం. ఇక్కడ స్థానిక కోర్టులో దాఖలు చేసిన పోలీసు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. నిందితులు వారిలో ఒకరి రొమ్ములను కోసివేశారు.. మరొకరి శరీరాన్ని 56 ముక్కలుగా నరికివేసి.. దారుణ హింస‌కు గుర‌య్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ (52), భగవల్ సింగ్ (68), అతని భార్య, మసాజ్ థెరపిస్ట్ లైలా (59)లకు కోర్టు గురువారం 12 రోజుల కస్టడీకి అప్పగించింది. "భగవల్ సింగ్, అతని భార్య లైలాకు అనుకూలంగా దేవతను ప్రసన్నం చేసుకోవడం ద్వారా రెండవ, మూడవ నిందితుల జీవితంలో శ్రేయస్సు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిందితులు నరబలిని నిర్వహించడానికి కుట్ర పన్నారు" అని రిమాండ్ రిపోర్టు పేర్కొంది.

పతనంతిట్టలోని ఎలంతూరు గ్రామంలోని దంపతుల ఇంటి ఆవరణలో బుధవారం నరికిన మృతుల శరీర భాగాలను వెలికితీశారు. సెప్టెంబర్ 26న మొదటి మహిళ కనిపించకుండా పోవడంతో షఫీని పోలీసులు విచారించారు. ఈ ముగ్గురూ జూన్‌లో రెండవ బాధితుడిని ఇదే విధంగా హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. 

ఈ కేసులో వివాహేత‌ర సంబంధం.. ! 

కేర‌ళ న‌ర‌బ‌లి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు. బాధితులు మ‌రింత ఎక్కువ మంది ఉండే అవ‌కాశ‌ముంద‌నే దానిపై కూడా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వివాహేత‌ర సంబంధ కోణం దాగివుంద‌నేదానిపై కూడా విచార‌ణ జరుపుతున్నార‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంత్రికుడు మహ్మద్ షఫీ తర్వాత టార్గెట్‌ లైలా భర్త భగవల్‌ సింగ్‌ అయ్యుంటాడనీ, ఆమెతో క‌లిసి జీవించేందుకు కుట్ర‌కు ప‌న్నాగం చేసి ఉంటాడ‌ని పోల‌సులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారంటూ ప‌లు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios