Asianet News TeluguAsianet News Telugu

మున్నార్ ను ముంచెత్తిన భారీ మంచు: ప‌ర్యాట‌కుల ఆనందం.. టీ తోట‌ల వారిలో ఆందోళ‌న

Munnar: దేశంలో శీతాకాల ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు కొత్త రికార్డులు న‌మోదుచేస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జమ్మూలో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌నీ, ఇదే స‌మ‌యంలో కాశ్మీర్ లోయలో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
 

Kerala : Heavy snow inundated Munnar: Tourists' joy, tea plantations worried
Author
First Published Jan 19, 2023, 12:44 PM IST

wether update: మున్నార్ ను భారీ మంచు ముంచెత్తింది. అక్క‌డ కురుస్తున్న మంచు కార‌ణంగా చ‌లీ తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతోంది. ఉష్ణోగ్ర‌తలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం అక్క‌డున్న వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్న ప‌ర్యాట‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌గా, అక్క‌డి టీ తోట‌ల వారు మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. మున్నార్ కేరళలోని ఇడుక్కి దక్షిణ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది సముద్ర మట్టానికి 1600–1800 మీటర్ల ఎత్తులో ఉంది. దక్షిణ కాశ్మీర్ గా పిలువబడే మున్నార్ కూడా పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా పేరుగాంచింది. డిసెంబర్-జనవరి నెలల్లో మున్నార్ లో చలి ప‌రిస్థితులు ఉండ‌టం సాధారణం. ఈ పరిస్థితుల్లో గత వారం రోజులుగా భారీ హిమపాతం కొనసాగుతోంది. ప్ర‌స్తుతం మున్నార్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే దిగువకు పడిపోయింది.

ఆనందంలో పర్యాటకులు.. ఆందోళ‌న‌లో స్థానికులు ! 

ద‌క్షిణ కాశ్మీర్ గా పేరుగాంచిన మున్నార్ లో ప్ర‌స్తుతం భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్ర‌తలు మైన‌స్ కు ప‌డిపోయాయి. ఉదయాన్నే మంచును ఆస్వాదించడానికి కేరళతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు తరలి రావడంతో నగర పర్యాటక రంగానికి ఇది శుభవార్త. అయితే, ప్ర‌స్తుత వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్న ప‌ర్యాట‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌గా, అక్క‌డి టీ తోట‌ల వారు మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మున్నార్‌లో హిమపాతం గురించి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియో దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, అది మంచు కాకపోవచ్చు.. పొగమంచు మాత్రమే ఉండవచ్చని అధికారులు తెలిపారు

రిసార్టులు, పర్యాటకులకు ఇది శుభవార్తే అయితే చలి తీవ్రతతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. మున్నార్‌ కొండల్లో ఎక్కువగా పండించే తేయాకుపై తీవ్ర ప్రభావం పడింది. టీ ఆకులపై మంచు కరిగితే పంట చేతికి రాకుండా పోతుంద‌ని టీ తోట‌ల‌వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌మ్మూకాశ్మీర్ లో రికార్డు ఉష్ణోగ్ర‌త‌లు..

దేశంలో శీతాకాల ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు కొత్త రికార్డులు న‌మోదుచేస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జమ్మూలో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌నీ, ఇదే స‌మ‌యంలో కాశ్మీర్ లోయలో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. "జమ్మూ డివిజన్‌లో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం, లోయలో తేలికపాటి వర్షం/మంచు జమ్మూ కాశ్మీర్‌లో వచ్చే 24 గంటల్లో కురిసే అవకాశం ఉంది" అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

శ్రీనగర్‌లో మైనస్ 1.4, పహల్గామ్‌లో మైనస్ 4.3, గుల్‌మార్గ్‌లో మైనస్ 7.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లడఖ్ ప్రాంతంలో కార్గిల్‌లో మైనస్ 12.7, లేహ్‌లో మైనస్ 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. జమ్మూలో 7.9, కత్రా 6.8, బటోటే 1.4, బనిహాల్ 1.1, భదర్వాలో కూడా 1.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌లు ప్రాంతాల్లో గత 24 గంటల్లో తేలికపాటి వర్షం.. ప‌లు చోట్ల మంచు కురిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios